మహబూబ్‌నగర్ అర్బన్, ఏప్రిల్ 11 : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కులవృత్తులకు ఆదరణ పెరిగిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో అధికారులు, గొర్రెలకాపరుల సంఘం సభ్యులతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక యాదవులు ఆర్థికంగా బలోపేతం కావాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రంలో అన్ని కులాలకూ పునర్జీవం పోస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటి విడుతలో రూ.192 కోట్లతో 15,368 యూనిట్లను అందజేశామన్నారు.
గొర్రెల కాపరుల సంఘం సభ్యుల సహకారంతో ఇతర రాష్ర్టాల నుంచి గొర్రెలను తెప్పించి పారదర్శకంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే లబ్ధిదారులను గుర్తించి.. వారి వాటా చెల్లించేలా చూస్తామన్నారు. ఈ విడుతలో యూనిట్‌ను రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచి.. రూ. 1,31,250 సబ్సిడీ ఇస్తున్నామన్నారు. గతంలో గుర్తించిన లబ్ధిదారులు చనిపోతే.. వారి స్థానంలో నామినీలను ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు మధుసూదన్‌గౌడ్, అసిస్టెంట్ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, రషీద్, గొర్రెలకాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్యయాదవ్, ముడా డైరెక్టర్ సాయిలు యాదవ్, నరసింహులు యాదవ్, ఎల్లప్ప యాదవ్, రాజగోపాల్ యాదవ్, శ్రీనివాస్‌యాదవ్, చందుయాదవ్, రమేశ్‌యాదవ్, సురేశ్‌యాదవ్ పాల్గొన్నారు.
అందరి అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 11 : అందరి అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహాత్మాజ్యోతిరావు ఫూలే జయంతిలో భాగంగా క్రిస్టియన్‌పల్లిలో ఉన్న ఆదర్శనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఫూలే, అంబేద్కర్ విగ్రహాలను మంగళవారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ స్థ లాల్లో అనధికారికంగా ఆవాసం ఉన్న పేదలకు జీవో నెంబర్-58 కింద రెగ్యులరైజేష న్ చేస్తామన్నారు. దళారులను నమ్మొద్దని, అంగన్వాడీ భవన నిర్మాణానికి రూ.10 ల క్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మహిళలకు కుట్టుమిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చే స్తామన్నారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు బోరు వేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కౌన్సిలర్ రాణి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, తాసిల్దార్ పార్థసారధి, మున్సిపల్ ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.