వనపర్తి, జూలై 30: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గడిచిన తొమ్మిదేండ్లలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామని, వచ్చిన మార్పులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కార్పెంటర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ముందుగా నియోజకవర్గంలో అభివృద్ధిపై తీసిన డ్యాకుమెంటరీని కార్పెంటర్లతో కలిసి మంత్రి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో బీడు భూములన్నీ సాగునీటి రాకతో పచ్చని పంటపొలాలుగా మారాయని, ఒకప్పుడు సాగుకు నీళ్లు లేక భూములన్నీ అమ్ముకునేవారు, కానీ నేడు ఎవరూ పొలాలను అమ్మే పరిస్థితి లేదన్నారు. అంతకుముందు జిల్లా కార్పెంటర్ సంఘం సభ్యులు మంత్రిని గజమాలతో ఘనంగా సన్మానించారు.
నాయకులకు నూతన బాధ్యతలు అప్పగింత
వనపర్తి, జూలై 30 : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని ప్రజలందరికీ వివరించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నాయకులకు సూచించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధిగా మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా వంగూరు ప్రమోద్‌రెడ్డి, వనపర్తి పట్టణ సమన్వయకర్తగా అరుణ్‌ప్రకాశ్, సీనియర్ సమన్వయకర్తగా రాములు యాదవ్‌కు ఆదివారం బాధ్యతలను అప్పగిస్తూ మంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వరాష్ట్రం తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ప్రతి ఇంట్లో ఏదో ఒక సంక్షేమ పథకం నుంచి లబ్ధిపొందిన వారు ఉన్నారన్నారు.
మంత్రి సమక్షంలో పార్టీలో చేరికలు
వనపర్తి, జూలై 30 : నియోజకవర్గంలోని ఖిల్లాఘణపురం, వనపర్తి మండలంలోని పెద్దగూడెం, కడుకుం ట్ల గ్రామాలు, పెద్దమందడి మండలానికి చెందిన 100 మంది నాయకులు ఆదివారం జిల్లాకేంద్రంలోని క్యాం పు కార్యాలయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షం లో పార్టీలో చేరారు. ముందుగా వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయా కార్యక్రమా ల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జెడ్పీ లోకనాథ్‌రెడ్డి, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి, మున్సిపల్ వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌గౌడ్, కౌన్సిలర్ పాకనాటి కృష్ణయ్య, నాయకులు, జిల్లా కార్పెంటర్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.