వనపర్తి, ఆగస్టు 24 : పేదల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సర్కార్ పనిచేస్తున్నదని, అభివృద్ధి, సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేం ద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ని యోజకవర్గంలోని 54 మంది లబ్ధిదారులకు గురువారం మైనార్టీబంధు కింద రూ.లక్ష చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద లు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో సీ ఎం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. మైనార్టీలకు షాదీముబారక్, ఆసరా పింఛన్లు అందజేస్తున్నామని.. వీలైనంత మందికి సాయం చేస్తున్నట్లు వివరించారు.
కాల్వల్లో పుష్కలంగా సాగునీరు పారుతుండడంతో వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ క్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు చే తినిండా పని దొరుకుతున్నదన్నారు. పదేండ్ల కిందటి పరిస్థితిని మీరందరూ చూశారని.. తెలంగాణ వచ్చాక జరిగిన అభివృద్ధి ఇప్పుడు కండ్ల ఎదుట కనిపిస్తున్నదన్నారు. దళిత, బీసీ, మైనార్టీ బంధు ద్వారా వంద శాతం సబ్సిడీతో ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. లబ్ధిదారులు సాయాన్ని సద్వినియోగం చేసుకొని ఉ న్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించా రు. వివిధ పనుల నిమిత్తం తనను కలవడానికి వచ్చిన ప్రజలు, అధికారులు, నాయకులు పూలదండలు, బొకేలు, శా లువాలను తీసుకొస్తున్నారని, వాటికి అ య్యే ఖర్చుతో పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. మంచి మనస్సుతో పలకరిస్తే చాలన్నారు.
లింగాయత్ భవనానికి స్థలం కేటాయింపు
జిల్లా కేంద్రంలో వీరశైవ లింగాయత్ భవనానికి పది గుంటలను కేటాయిస్తూ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రొసీడింగ్ కాపీని సంఘం సభ్యులకు అందజేశారు. అ డిగిన వెంటనే స్థలాన్ని కేటాయించడం తో మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్, పట్టణ ప్రధాన కార్యదర్శులు రమేశ్, పరంజ్యో తి, ఆర్డీవో పద్మావతి, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, సత్యం, సమద్, భువనేశ్వరి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
‘డబుల్’ ఇండ్లకు మిషన్ భగీరథ నీళ్లు..
వనపర్తి అర్బన్, ఆగస్టు 24 : డబుల్ బెడ్రూం ఇండ్లకు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పీర్లగుట్ట ప్రాం తంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద తాగునీటి కుళాయిలను మంత్రి ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద అన్ని వసతులు కల్పిస్తున్నామన్నా రు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చే యాలని సూచించారు. విద్యుత్ సమస్య లు తలెత్తకుండా ట్రాన్స్ఫార్మర్లను మం జూరు చేశామన్నారు. డబుల్బెడ్రూం ఇండ్ల వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలో మినీ ఫంక్షన్‌హాల్ ఏర్పాటు చేయాలని మున్సినల్ కమిషనర్నుఆదేశించారు. అనంతరం ఇండ్లలోకి వెళ్లి అక్కడి పరిస్థితుల ను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మ న్ రమేశ్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డి, కౌన్సిలర్లు మహేశ్, న క్క మహేశ్, కృష్ణ, నాగన్న యాదవ్, నాయకులు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.