Delhi Airport : ఢిల్లీలో ఓవైపు కాలుష్యం, మరోవైపు దట్టంగా కమ్ముకుంటున్నపొగమంచు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా పొగమంచు కారణంగా ఎయిరిండియా(Air India) విమానం ఇంజిన్ బ్యాగేజీ కంటైనర్‌లో చిక్కుకొని దెబ్బదిన్నది. ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం గమనించిన అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆ విమానాన్ని సురక్షిత ప్రదేశంలో పార్క్ చేశామని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది.
ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం భారీగా పొగమంచు కుమ్ముకుంది. దాంతో, ఎయిరిండియా 350కు చెందిన ఏఐ101 ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు వెళ్లాల్సింది. ‘ఇరాన్ తమ గగనతలాన్ని మూసివేత కారణంగా విమానం దారి మార్చుకోవాల్సి వచ్చింది. ఫ్లయిట్ ఢిల్లీలో దిగిన తర్వాతే పొగమంచు కారణంగా కుడివైపు ఇంజిన్ అక్కడి బ్యాగేజీ కంటైనర్లోఇరుక్కుంది. దాంతో.. కొంతమేర దెబ్బతిన్నది’ అని ఎయిరిండియా మీడియా ప్రతినిధి వెల్లడించారు. అయితే.. వెంటనే విమానాన్ని సురక్షిత ప్రాంతంలో పార్కింగ్ చేశామని, ఈ ఘటనలో ప్రయాణికులకు, విమాన సిబ్బందికి ఎలాంటి ప్రమాదం తలెత్తలేదని ఎయిరిండియా పేర్కొంది.
Air India Delhi-New York Flight Engine Sucks In Baggage Container, Damaged https://t.co/6DMnJ0J8is pic.twitter.com/cQfY7Nqym0
— NDTV (@ndtv) January 15, 2026
ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు సిద్దమైంది సంస్థ. దెబ్బతిన్న ఇంజిన్‌కు మరమ్మతు చేయాల్సి ఉన్నందున విమాన సర్వీస్‌ను నిలిపివేశారు. ఫలితంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారిని ప్రత్నామ్యాయ మార్గాల్లో గమ్య స్థానానికి చేర్చుతామని ఎయిరిండియా తెలిపింది.