కల్వకుర్తి/వెల్దండ, అక్టోబర్ 7 : అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కండ్లని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కల్వకుర్తి పట్టణంలోని వివిధ అభివృద్ధి పనులకు, వెల్దండ మండలకేంద్రంలో రూ.కోటితో నిర్మించనున్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే నారాయణరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వెల్దండ మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో మట్ట వెంకటయ్యగౌడ్ పొలంలో ఈత మొక్కలను నాటి నీళ్లు పోశారు.
ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ హామీలను ప్రణాళికాబద్ధంగా అమలుచేస్తున్నామన్నారు. వెల్దండలో త్వరలోనే నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ భవన సముదాయంలో పాఠశాలను ఏర్పాటు చేసుకుందామన్నారు. అంతకుముందు మంత్రికి కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ రఘనాథ్గైక్వాడ్, కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. అర్హులైన రైతుందరికీ రుణమాఫీ చేయాలని పీఏసీసీఎస్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి మంత్రి పొంగులేటికి వినతిపత్రం అందజేశారు.
ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, పొల్యూషన్ బోర్డు సభ్యుడు బాలాజీ, కౌన్సిలర్లు సూర్యప్రకాశ్‌రావు, చంద్రకాంత్‌రెడ్డి, నాయకులు ఆనంద్‌కుమార్, భాస్కర్‌రెడ్డి, భూపతిరెడ్డి, జయప్రకాశ్, మోతీలాల్, రవీందర్రావు, రషీద్, శ్రీనుయాదవ్, పర్వత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, తాసీల్దార్ కార్తీక్‌కుమార్, సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్సై కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.