కొల్లాపూర్, అక్టోబర్ 9 : తెలంగాణలో పదేండ్ల కాలం లో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని 18వ వార్డులో ఉన్న గంగమ్మ ఆలయంలో పూజలు చేసి అక్కడే షెడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మత్స్య సహకార సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు శాలువా క ప్పి సన్మానించారు. అదేవిధంగా 4వవార్డులో రూ.60లక్షలతో ఏర్పాటు చేసిన మినీపార్కును, రూ.20లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించారు. మినీ స్టేడియంలో రూ.52లక్షలతో యోగా, జిమ్ కేంద్రాలను ప్రారంభించారు. చు క్కాయపల్లిలో నిర్మించనున్న సీసీరోడ్లు, సైడ్రైన్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలకుల వివక్షతతో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందన్నారు.
స్వరాష్ట్రంలో దశల వారీగా ప్రాజెక్టులను పూర్తి చేయడంతో బంగారు తెలంగాణగా అవతరించిందన్నారు. కాళేశ్వరం, పీఆర్ఎల్ఐ ప్రాజెక్టులతో బీడు భూములను సాగులోకి తీసుకొచ్చామన్నా రు. సీఎం కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయన్నారు. అందరికీ అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. గతంలో ఉన్న నాయకుడిలా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తన వద్దకు వచ్చే వారి పనులు చేసి పెడుతున్నానన్నారు. మీ బిడ్డగా భావించి రెండోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరారు. మరోసారి గెలిపిస్తే నియోజకవర్గంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎల్లూ ర్ సర్పంచు లక్ష్మీదేవమ్మ, ఎంపీటీసీలు మంజుల, శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీచారి, కౌ న్సిలర్లు కృష్ణ, అనిత, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దశర థం, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.