నాగర్కర్నూల్, ఆగస్టు 20 : కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ వైద్య విద్యార్థులు, వైద్యు లు రోజుకో రీతిలో నిరసనలు చేపడుతున్నారు. మంగళవా రం ప్రభుత్వ మెడికల్ విద్యార్థులు తరగతులను బహిష్కరించి కళాశాల ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. సా యంత్రం కొవ్వొత్తులతో ప్రధాన రహదారి మీదుగా శాంతి ర్యాలీ నిర్వహించారు.
బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు. నిందితులను ఉరితీసేంత వరకు తమ నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు. వైద్యులు, వైద్య విద్యార్థులు, మహిళలు, చిన్నారులకు భ ద్రత లేకుండాపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీ సుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో మెడికల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.