వెల్దండ : నాగర్కర్నూల్ ( Nagarkurnool ) జిల్లా వెల్దండ మండల పరిధిలోని రాచూర్ గ్రామంలో గర్భిణులకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం మాజీ ఎంపీటీసీ గుత్తి వెంకటయ్య, మాజీ సర్పంచులు కొంగల జయమ్మ, దయ్యాల యాదయ్య లు మెడికల్ కిట్లను ( Medical Kits ) అందజేశారు. వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఉప్పల వెంకటేష్ చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. గర్భిణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, గ్రామస్థులు గుత్తి బాలకృష్ణ, బీరయ్య, జంగయ్య , ఎల్లయ్య, అంజయ్య, మల్లయ్య ,జంగయ్య తదితరులు పాల్గొన్నారు.