మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 23: ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో నాలుగు రోజులుగా నిర్వహించిన వైద్యవిజ్ఞాన సదస్సు సోమవారం ముగిసింది. ఎస్వీఎస్ కళాశాల ఏర్పాటు చేసి 25ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా (ఎస్వీఎస్ మెడ్ ఎక్స్ పో- 2024)లో మానవ శరీరంలోని అవయవాలు, వైద్యసేవలను ప్రదర్శనకు ఉంచారు. ప్రదర్శనను తిలకించేందుకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా వైద్యవిద్యార్థులు 25 విభాగాలకు సంబంధించి విద్యార్థులకు కండ్లకు కట్టినట్లు అవగాహన కల్పించారు. మొత్తం 1200 రకాల స్టాళ్లను ఏర్పాటు చేయగా.. 50వేల పైచీలు కు విద్యార్థులు తిలకించినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు మెడిసిన్‌పై అవగాహన పెంచే ప్రయత్నంలో వైద్యవిజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రెసిడెంట్ కార్యదర్శి రాంరెడ్డి, ప్రిన్సిపాల్ జోషి, వైస్ ప్రిన్సిపాల్ రోహిత్, దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.