పాలమూరు : ‘ ప్రేమించు, క్షమించు, క్రిస్టియన్ ను అనుసరించు’ అనే మూడు ప్రధాన సూత్రాలతో జరుపుకునే పర్వదినం ఈస్టర్ పండుగని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy ) అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ కల్వరీ కొండ పై నిర్వహించిన ఈస్టర్ పండుగ (Easter festival ) సందర్భంగా ఈస్టర్ సూర్యోదయ ఆరాధనలో పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోవాలన్నారు.
హైదరాబాద్ నుంచి వచ్చిన మతపెద్దలు చెప్పిన సువార్త లోని విషయాలు మనసుకు హత్తుకున్నాయన్నారు. కల్వరీ కొండ ను దశల వారీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం 10.72 లక్షల జనరల్ ఫండ్ ద్వారా నిర్మించిన సీసీ రోడ్ , వాటర్ ట్యాంక్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, నాయకులు సీజే బెనహార్, చిన్న రాజు, క్రిస్టియన్ మైనారిటీ పట్టణ అధ్యక్షులు శామ్యూల్ దాసరి, జాజిమొగ్గ నరసింహులు, ఫాస్టర్, చైర్మన్ వరప్రసాద్, జాకబ్, ఎమ్యాన్యుల్ రాజు, స్టీఫెన్, టైటస్ రాజేంద్ర, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.