నాగర్‌కర్నూల్‌టౌన్, జూన్ 2 : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా మంతటి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఆదివారం సాయంత్రం మంతటి చౌరస్తాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి సోమవారం నాగర్‌కర్నూల్‌లోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లి కార్యకర్త మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.