అమ్రాబాద్, సెప్టెంబర్ 10 : వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని, అందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి మర్రి జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం అమ్రాబాద్ మండలకేంద్రంలోని ఎంకే గార్డెన్లో నిర్వహించిన అమ్రాబాద్, పదర ఉమ్మడి మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీ య సమ్మేళనం నిర్వహించగా మర్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
స్థానిక సంస్థ ఎన్నికలలో కేసీఆర్ నాయకత్వంలో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేయాలని స్థానిక ఎన్నికల విజయం తో బీఆర్ఎస్ విజయఢంకా మోగించి అమ్రాబాద్, పదర మండలాలలో గులాబీ జెండాను ఎగురవేయాలని సూచించారు. ఉమ్మడి మండలాల ప్రజ లు, కార్యకర్తలు ఎవ్వరూ అధైర్య పడవద్దని వారికి ఎల్లప్పు డూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చా రు. కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు తలవంచకుండా ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని, మన పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజలు, రైతులు రాజులుగా, మహిళలు, కులవృత్తుల వారు ఆర్థికంగా ఎదుగుతూ ఒకరిపై ఆధారపడకుండా బతికారని తిరిగి వారికి అలాంటి రోజులను మన బీఆర్ఎస్ పార్టీ అందించేందుకు కేసీఆర్ అడుగు జాడలో నడుస్తూ గులాబీ జెండాను స్థానిక ఎన్నికల్లో ఎగురవేసే దిశగా మనం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంభిస్తూ ప్రజలను మోసం చేస్తుందని 21 నెలల నుంచి పాలన చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చి న హామీలు, మోసాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధిచెప్పాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోకల మనోహర్, పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శారద, నాయకులు చెన్నకేశవులు, తిరుపతయ్య, మల్లేశ్, జగన్‌గౌడ్, మోహన్, శ్రీనివాసులు, బాల్‌నారాయణ, భారతితోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.