మహబూబ్‌నగర్ రూరల్, మే 14 : మన్యంకొండలోని లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగిం ది. వేడుకను తిలకించేందుకు భక్తులు వందలాదిగా తరలిరావడంతో కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణం నరసింహస్వామి నా మస్మరణతో మార్మోగింది.
వేడుకను తిలకించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ఆలయ ధర్మకర్త, చైర్మన్ మధుసూదన్ కుమార్, ఈవో పురేందర్ కుమార్, మున్సిపల్ చైర్మన్ కేసీఆర్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎం పీపీ అనిత, పీఏసీసీఎస్ చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, కోఆప్షన్ అల్లావుద్దీన్, నాయకులు రవీందర్‌రెడ్డి, రాఘవేందర్‌గౌడ్ పాల్గొన్నారు.