బల్మూరు, ఫిబ్రవరి 3 : సోలార్ విద్యుత్, బ్యాటరీ, అవసరమైన్నప్పుడు పెట్రోల్‌తో నడిచే హైబ్రిడ్ త్రీ ఇన్ వన్ సైకిల్‌కు రూపకల్పన చేశాడు నల్లమలకు చెందిన నిరుపేద హైటెక్ విద్యార్థి మాంచినేని గగన్‌చంద్ర. హైబ్రీడ్ సైకిల్‌ను బైక్‌లా నడుపావచ్చు.. సైకిల్లా తొక్కవచ్చు అంటున్నాడు 14ఏండ్ల కుర్రాడు. గగన్చంద్రది అచ్చంపేట ని యోజకవర్గంలోని ఏజెన్సీ గ్రామమైన బల్మూరు మండల కేంద్రం. బల్మూరుకు చెదిన నాగరాణి, భాస్కర్ల ఏకైక కుమారుడు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మదో తరగతి చదువుతూ ఇటీవల పాండిచ్చేరిలో నిర్వహించిన సైన్స్‌ఫెయిర్‌లో తృతీయ బహుమతి సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు.
సైకిల్‌ను ఎలాంటి ఖర్చు లేకుండా బ్యాటరీతో 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా.. సో లార్ విద్యుత్‌తో రోజంతా ప్రయాణించేలా సైకిల్‌ను రూ పొందిచాడు. సాధారణ సైకిల్‌కు ఎలక్ట్రికల్ బ్యాటరీ, సోలా ర్ ప్యానల్, హబ్ మోటరు అమర్చాడు. డిజిటల్ స్పీవో మీటర్, సెంట్రల్ బాక్ సిస్టిమ్తోపాటు నావిగేషన్, జీపీఎస్, బ్రాకింక్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశాడు. అధునాత వాహనాల మాదిరిగా ఈ సైకిల్‌కు ఉన్న జీపీఎస్‌తో ఎక్కడి నుంచైనా ట్రాకింగ్ చేయవచ్చు.
మొబైల్ వాయిస్స్ క మాండ్, అలెక్సాతో మ్యూజిక్, కాల్స్ ఆపరేటర్ చేసేలా సైకిల్‌ను రూపకల్పన చేశాడు. సైకిల్లో కంట్రోల్ బాక్స్‌ను గగన్ సొంతంగా తయారు చేశాడు. అవసరమైన సామగ్రిని ఆన్లైన్లో కొనుగోలు చేశాడు. ఇప్పటి వరకు మొ త్తం రూ.30వేల వరకు ఖర్చు చేశాడు. భవిష్యత్‌లో ఈ ఖర్చు ను మరింత తగ్గిస్తానంటున్నాడు. ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి సైన్స్‌ప్రదర్శనలో దాదాపు 250 మం ది పాల్గొనగా.. ఫిబ్రవరిలో నిర్వహించనున్న జాతీయ స్థా యి సైన్స్‌ఫెయిర్‌కు గగన్‌చంద్ర ఎంపికకాగా.. సైకిల్ త యారీకి కావాల్సిన పరికరాలు, వస్తువులు ఇప్పించే వి ధంగా ఎమ్మెల్యే కృషి చేయాలని గ్రామస్తులు కోరారు.
భవిష్యత్‌లో పేద, సా మన్యులు, దివ్యాంగులకు ఎలక్ట్రిక్ కారు తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఎవరికైనా ఒక వె హికిల్ ఉండాలనే విధం గా తయారు చేయాలన్నదే ముఖ్యంగా పెట్టుకున్నా. మొబైల్‌తో లాక్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో దొంగలు ఎవరూ ప్రయత్నించినా.. సెల్ఫోన్లో కనిపిస్తుంది. తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉంది. సోలార్‌తో పగ లు, రాత్రి బ్యాటరీతో నడుపవచ్చు. దివ్యాంగుల కోసం సోలార్‌తో తయారు చేయడం ముం దున్న లక్ష్యం. తక్కువ ఖర్చుతో ఎక్కువమందికి ఉపయోగపడే విధం గా ఎలక్ట్రిక్ కారును తయారు చేయాలన్నదే లక్ష్యం.
– గగన్ చంద్ర, విద్యార్థి, బల్మూరు