అచ్చంపేటరూరల్ : తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రైవేట్ బస్ డ్రైవర్లు ( Private Bus Drivers) చేస్తున్న సమ్మెకు యాజమాన్యాలు స్పందించాయి. వేతనాలు పెంచాలని సీఐటీయూ ( CITU ) ఆధ్వర్యంలోని అనుబంధ సంఘం గత నాలుగు రోజులుగా ఆర్టీసీ డిపో ఎదుట సమ్మెను నిర్వహిస్తున్నారు.
దీంతో యాజమాన్యం దిగిరావడంతో జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం. శంకర్ నాయక్ తెలిపారు.డ్రైవర్‌కు మూడు వేల వేతనాలు గతానికంటే ఎక్కువ ఇవ్వాలని (Wages Increase) నిర్ణయించారని పేర్కొన్నారు. జీతాలు పెరిగిన సందర్భంగా డ్రైవర్లు సమ్మె విరమించి విధుల్లో చేరారని వెల్లడించారు.
ఈ సందర్భంగా అద్దె బస్సు డ్రైవర్స్ యూనియన్ తాలూకా అధ్యక్షులు సుధాకర్, ప్రధాన కార్యదర్శి శ్రీహరి కోశాధికారి అనిల్, నాగరాజు బాలయ్య చంద్రయ్య శేఖర్, సీఐటీయూ కార్మిక సంఘం అండగా ఉండటంతోనే వేతనాలు పెరిగాయని హర్షo వ్యక్తం చేశారు. డ్రైవర్ల సమ్మె చేయడం వలన ప్రజలకు ప్రయాణికులకు ఇబ్బంది లో కలుగుతుండటంతో స్థానిక డీఎం మురళి దుర్గ ప్రసాద్ జోక్యం చేసుకొని అద్దె బస్సు యాజమాన్యాన్ని పిలిచి చర్చలు జరిపినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.