పెబ్బేరు, సెప్టెంబర్ 29 : పెబ్బేరులో హిందూ జా గృతం సభ్యులు చేపట్టిన వినూత్న కార్యక్రమం మన ఊరు-మన గుడి ఆదివారం మిట్ట ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహించారు. ప్రతి వారం మున్సిపాలి టీ పరిధిలోని ఒక గుడిని శుభ్రం చేసి సంప్రోక్షణ చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమం 12 వారాలుగా కొనసాగుతున్నది.
సుమారు వంద మంది సభ్యులు గల బృందం ఆలయం గర్భగుడి, విగ్రహాలు, పరిసరాలను శుభ్రం చేయడమే గాక, అవసరమైన చోట రం గులు వేశారు. ఈ సారి చిన్న పిల్లలు కూడా కార్యక్రమంలో భాగస్వామ్యులై తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించడం విశేషం.