గద్వాల అర్బన్, ఫిబ్రవరి 14: ఆస్తి కోసం సొంత సోదరుడిని అన్న, తమ్ముడు, తల్లిదండ్రి స్నేహితులతో కలిసి హత్యచేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈనెల 12వ తేదీన తనగల గ్రామానికి చెందిన రమేశ్ మద్దూరు స్టేజీ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. తన భర్త మృతిపై అనుమానం ఉందని భార్య సం ధ్యపోగు చంద్రకళ శాంతినగర్ ఠాణాలో ఫి ర్యాదు చేసింది. కొంతకాలంగా ఆస్తికి సంబంధిం చి తన భర్తకు తల్లిదండ్రులు, అన్నదమ్ములకు గొడవలున్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో భార్య ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసిన శాంతినగర్ పోలీస్‌లు దర్యా ప్తు చేపట్టారు.
మృతుడు రమేశ్ తన తండ్రి కిష్టన్న, తల్లి తిములమ్మ, అన్న గోపి, తమ్ముడు మహేశ్‌కు ఆస్తి వివాదంలో ఘర్షణలు ఉన్నట్లు తేలింది. గతేడాది మహేశ్ బైక్ పై వస్తుండగా మృతుడు రమేశ్ హత్యాయ త్నం చేయగా.. కేసులు నమోదయ్యాయి. ఈ క్ర మంలో తన అన్న రమేశ్‌ను ఎలాగైనా చం పాలని నిర్ణయించుకున్న మహేశ్ తల్లిదండ్రులతోపాటు మరో అన్న గోపి పతకం పన్నారు. మహేశ్ తనకు పరిచయమున్న బోయ నర్సింహులకు విషయం చెప్పి తన అన్న రమేశ్‌ను చంపితే రూ.లక్షాయాభై వేలు ఇస్తామని ఒప్పందం చేసుకొన్నారు. అందుకు మరో ఇద్దరైన బండమీది తిమ్మప్ప, బోయ నాగేంద్ర సహకారం తీసుకొన్నారు. ఈ క్రమంలో రమేశ్‌ను చంపాలని వారం కిందట పతకం వేశా రు.
రమేశ్ వెంకటాపురం స్టేజీ నుంచి యాపదిన్నెకు వెళ్తుండగా.. బొలేరోతో ఢీ కొట్టి చం పాలని నిర్ణయించగా కుదరలేదు. అనంతరం 12వ తేదీన రమేశ్ తన మామ సుధాకర్‌తో కలిసి అలంపూర్ కోర్టు పనుల నిమిత్తం వెళ్లి వస్తుండగా.. మహేశ్, బోయ నర్సింహులు కారులో, బండమీద తిమ్మప్ప, బోయ నాగేం ద్ర బొలేరోలో అనుసరించి పతకం ప్రకారం మద్దూరు స్టేజీ దగ్గర ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో రమేశ్, తన మామ కిందకు పడగా.. వెంటనే కారులో ఉన్న మహేశ్, బోయ నర్సింహులు వెంట తెచ్చుకున్న వేట కొడవల్లతో రమేశ్ గొంతు నరికి చంపారు. అనంతరం రమేశ్ మామపై దాడిచేసి అదే కారులో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
అనంతరం డీఎస్పీ మొగిలయ్య, సీఐ టాటాబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో సాంకేతి పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఆధారంగా నమ్మదగిన సమాచారం మేరకు నిఘా నిర్వహించగా.. న్యాయవాది కోసం హైదరాబాద్‌కు కా రులో వెళ్తుండగా.. జాతీయ రహదారిపై జల్లాపూర్ ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద మధ్యాహ్నం 2గంటలకు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులు ఏ1.కిష్టన్న(తండ్రి), ఏ2.తిములమ్మ(తల్లి), ఏ3.గోపి(అన్న), ఏ4.మహేశ్(తమ్ముడు), ఏ5. బోయ నర్సింహులు, ఏ6. బండమీద తిమ్మప్ప, ఏ7 బోయ నాగేంద్ర. వీరిలో ఏ2.తిమ్ములమ్మ పరారీలో ఉండగా మిగతా వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అనంతరం వారి నుంచి వేట కొడవళ్లతోపాటు కారు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన అయిజ, మానవపాడు ఎ స్సైలు, బాషా, స్వామి, రాజు, వెంకప్ప, హు స్సేన్, యాకుబ్‌ను ఎస్పీ అభినందించారు.