తిమ్మాజీపేట : నాగర్‌కర్నూల్ జిల్లా మండలంలోని బావాజీ పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ కింద పడి ( Tractor overturns) ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు గ్రామానికి చెందిన బాలస్వామి (54) ట్రాక్టర్‌తో వ్యవసాయ పనులు చేసుకునేవాడు. ఈ క్రమంలో బుధవారం తన వ్యవసాయ పొలాన్ని ట్రాక్టర్‌తో దున్ని,తిరిగి ఇంటికి వస్తుండగా పొలం నుంచి రోడ్డు ఎక్కుతున్న క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి, బోల్తాపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి, జేసీబీ సహాయంతో ట్రాక్టర్‌ను తొలగించారు. అతని బయటకు తీయగా అప్పటికే అతడు మృతి చెందాడని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.