గద్వాల అర్బన్, ఏప్రిల్ 12 : జిల్లా నడిబొడ్డున వ్యక్తి దారుణహత్యకు గురై న ఘటన శనివారం అర్థరాత్రి చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేర కు…జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్ కింద ఆదివారం ఉదయం ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. విష యం తెలిసిన వెంటనే డీఎస్పీ మొగిలయ్య, సీఐ టంగూటురి శ్రీను ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కాగా మృతుడితోపాటు మరికొంతమంది రా త్రి సమయంలో మద్యం తాగినట్లు అ నుమానం వ్యక్తం చేస్తున్నారు.
మ ద్యం తాగాక మృతుడు వెంట వచ్చిన వ్యక్తులే మృతుడిపై దాడి చేసి రాళ్లతో మొహం గుర్తు పట్టలేనంతగా గాయ పర్చి హత్యచేసి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా ఈ హత్య దేని కోసం జరిగింది …మృతి చెందిన వ్యక్తి ఏ ప్రాంతానికి చెందిన వాడు..హంతకులు ఎవరు అ న్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అర్థరాత్రి సమయం లో ైప్లెఓవర్ చుట్ట్టూ ఉన్న ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అలాగే హత్య ఘటనలో క్లూస్ టీం, పోలీస్ జాగిలాల తో ఆరా తీస్తున్నారు.
హత్య జరిగిన స్థలంలో మద్యం సీసా లు, ప్లాస్టిక్ బాటి ల్లు, గ్లాసులు తదితర వాటిని గుర్తించి వాటి మీద వేలిముద్రలను గుర్తించి ల్యాబ్‌కు పంపించినట్లు సమాచారం. మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై సీఐ శ్రీను వివరణ కోరగా జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్ కింద అర్థరాత్రి సమయంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు ఏ ప్రాంతం వ్యక్తి… ఎందుకు చంపారనే దానిపై ఆరా తీస్తున్నాం. త్వరలో వివరాలు వెల్లడిస్తామన్నారు.