కందనూలు హస్తగతం
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లు రవి విజయం సాధించారు. గతనెల 13 వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. నెల్లికొండ మార్కెట్‌యార్డులోని స్ట్రాంగ్ రూం వద్ద ఓట్ల లెక్కింపు చేపట్టారు.
- l 94,414 ఓట్ల మెజార్టీతో మల్లు రవి విజయం
నాగర్‌కర్నూల్, జూన్ 4(నమస్తే తెలంగాణ) : నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లు రవి విజయం సాధించారు. గతనెల 13 వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. నెల్లికొండ మార్కెట్‌యార్డులోని స్ట్రాంగ్ రూం వద్ద ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎన్నికల అధికారి ఉదయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆయా పార్టీల అభ్యర్థు లు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూంను తెరవగా.. ఉదయం 8గంటలకే కౌంటింగ్‌ను ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవి, బీజేపీ అభ్యర్థిగా భరత్‌ప్రసాద్‌తో పాటు మొత్తం 19మంది పోటీ చేశారు. ఈ ఫలితాల్లో తొలి నుంచి ఆధిక్యంలో ఉన్న మల్లు రవి 94,414 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పార్లమెంట్ పరిధిలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, జోగుళాంబ గద్వాల, అలంపూర్, వనపర్తి అసెం బ్లీ నియోజకవర్గాల్లో 17,38,254 మంది ఓటర్లు ఉం డగా 69.46శాతంతో 12,07,471 ఓట్లు పోలయ్యా యి.
పోస్టల్ బ్యాలెట్లలోనూ కాంగ్రెస్‌కు అత్యధికంగా 5,813 ఓట్లు, బీజేపీకి 5,760, బీఆర్ఎస్కు 2,127, ఇతరులకు 511, నోటాకు 69ఓట్లు వచ్చాయి. మొత్తం 22రౌండ్లలో లెక్కింపు జరుగగా చివరి రౌండ్ ఫలితాల ప్రకారం మల్లు రవికి 4,65,072 ఓట్లు పోలయ్యాయి. రెండోస్థానంలో నిలిచిన భరత్ప్రసాద్కు 3,70,658 ఓట్లు, మూడోస్థానంలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్పీకి 3,21,343 ఓట్లు వచ్చాయి. ఇతర అభ్యర్థులకు 58,625ఓట్లు పోలవ్వగా.. నోటాకు 4,969 ఓట్లు వచ్చాయి. ఎంపీగా గెలిచిన మల్లు రవికి ఎన్నికల అధికారి ఉదయ్‌కుమార్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించగా ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, మేఘారెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ పాల్గొన్నారు.
ఇంత మెజార్టీ ఊహించలేదు.. : మల్లు రవి
నాగర్‌కర్నూల్, జూన్ 4 : ఇంత మెజార్టీ ఊహించలేదని.. తనను గెలిపించిన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఎంపీ మల్లు రవి అన్నా రు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కశిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితో కలిసి నల్లవెల్లి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ర్యాలీగా కౌంటింగ్ కేం ద్రానికి వెళ్లి మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

