మక్తల్, నవంబర్ 30 : పదకొండు నెలల కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పేదలు, రైతుల తరఫున, వి ద్యార్థులకు మద్దతుగా బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాల దె బ్బకు రేవంత్‌రెడ్డి అబ్బా అని తోక ముడుచుకొని ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను వెనకి తీ సుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
శనివారం ఆయన మ క్తల్ లో విలేకరులతో మాట్లాడారు. లగచర్లలో బీఆర్ఎస్ చేసిన పోరాటం, రైతుల తరఫున కొడంగల్ మాజీ ఎమ్మె ల్యే నరేందర్‌రెడ్డి జైలుకు వెళ్లడం.. రానురాను రైతుల నుం చి ఒత్తిడి పెరగడం, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎకు వ కావడంతోనే ప్రభుత్వం దిగి రాక తప్పలేదన్నారు. ఫా ర్మా పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేసిన రే వంత్‌రెడ్డి ముందుగా ఆరు గ్రామాల ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా అమాయకంగా కేసులు నమోదు చేసి జైల్లో ఉంచిన ప ట్నం నరేందర్‌రెడ్డిని అదేవిధంగా లగచర్ల, రోటిబండ తండా రైతులను జైలు నుంచి విడుదల చేసి, కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఇకముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలను తీసు కుంటే బీఆర్ఎస్ తరఫున ఎప్పటికప్పుడు పోరాటం చే స్తామని హెచ్చరించారు. నారాయణపేటలో శుక్రవారం చే పట్టిన దీక్షా దివస్ కార్యక్రమానికి మక్తల్ నియోజకవర్గం తరఫున పెద్ద ఎత్తున తరలివెళ్లిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు.