మక్తల్ రూరల్: పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో నూతనంగా ఎంపికైన కర్ని గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులను ఎమ్మెల్యే సన్మానిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ పటిష్ఠత కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు.
పార్టీలో కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అన్నివిధాల అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలన్నారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ కర్ని గ్రామ కమిటీ అధ్యక్షుడు లక్ష్మప్ప, ఉపాధ్యక్షుడు రాజు, కార్యదర్శి దత్తు, కోశాధికారి చిన్నతాయప్పలను ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఇదిలా ఉండగా కర్ని గ్రామానికి చెందిన ఎల్జ బితమ్మ , దమ్మలకు మంజూరైన సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రాఘవేందర్ గౌడ్ పాల్గొన్నారు.