నాగర్ కర్నూల్: ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న సన్న బియ్యాన్ని ( Rice ) సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) కోరారు. నాగర్ కర్నూల్ మండలం గగ్గలపల్లి గ్రామంలో గురువారం సన్న బియ్యాన్ని పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీతో పేదల ఇళ్లల్లో సందడి నెలకొందని తెలిపారు.
పేదలకు ఆర్థిక భారం తగ్గించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకే ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోందని వెల్లడించారు. రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలు ఆకలికి గురికాకుండా పోషకాహారాన్ని అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ( MLA Rajesh Reddy) అన్నారు.
లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం సజావుగా అమలవ్వాలని, బియ్యం పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలను సహించేది లేదని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు , ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఆర్డీవో , మండల నాయకులు పాల్గొన్నారు.