పాలమూరు, ఏప్రిల్ 11 : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఫూలే జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డితో కలిసి జిల్లా కేంద్రంలోని ఆ యన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు చదువుకుంటేనే స మాజం బాగుపడుతుందని గ్రహించిన వ్యక్తి అని గుర్తు చేశా రు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ అర్బన్, ఏప్రిల్ 11 : మహాత్మా జ్యోతిరా వు ఫూలే మహనీయుడని, ఆయన సేవలు దేశానికే ఆదర్శమని కలెక్టర్ రవినాయక్ అన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఫూలే చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో మహిళల పాఠశాల వి ద్యను సులభతరం చేసి, కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చే సిన సంఘ సంస్కర్త అని కొనియాడారు.
జడ్చర్ల, ఏప్రిల్ 11 : మండలకేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ కులసంఘాల నాయకులు ఫూలే విగ్రహాల వద్ద నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, వెంకటేశ్, రమేశ్, ఉమాశంకర్‌గౌడ్ తదితరులున్నారు.
ఊటూర్, ఏప్రిల్ 11 : కుల రహిత సమాజం కోసం ఫూలే చేసిన కృషి మరువలేనిదని తెలంగాణ విద్యావంతుల వేదిక ఉమ్మడి పాలమూరు జిల్లా సమన్వయకర్త మహేశ్‌గౌడ్, వీహెచ్‌పీ జిల్లా నాయకులు రాములు, భీమ్రాజ్, అంబేదర్ సంఘం మండల అధ్యక్షుడు దశరథ్ అన్నారు. గురువారం ఊటూర్, బిజ్వార్ గ్రామాల్లో ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్, లక్ష్మీకాంత్‌రెడ్డి, లింగం, శ్రీనివాసులు, మోహన్‌రెడ్డి, శివకుమార్, శంకర్, వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
పాలమూరు, ఏప్రిల్ 11 : మమబూబ్నగర్లోని జ్యోతిరా వు ఫూలే విగ్రహానికి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ పూ లమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, బీసీ హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.
మిడ్జిల్, ఏప్రిల్ 11 : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడడంతోపాటు మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించి న వారిలో మొదటి వ్యక్తి జ్యోతిరావు ఫూలే అని అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బుచ్చయ్య అన్నారు. గురువారం మం డల కేంద్రంలోని అంబేద్కర్ భవనం వద్ద ఆయన చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, దళిత బహుజన, రాజకీయ నా యకులు, అధికారులు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మాగనూర్, ఏప్రిల్ 11 : మాగనూర్ జెడ్పీ హైస్కూల్ ఆవరణలో జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి ని వాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రమేశ్, మహేశ్, అంజి, మధు, కతలప్ప తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 11 : మహాత్మా జ్యోతిరావు ఫూలే సమసమాజ స్థాపనకు ఎంతగానో కృషి చేశారని బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి కృష్ణమాచారి అన్నారు. గురువా రం పట్టణంలోని తన కార్యాలయంలో ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారి కన్యాకుమారి, హాస్టల్ వార్డెన్లు రేణుక, మంజుల, శివ, నరేశ్, రాము, అజయ్, సిబ్బంది పాల్గొన్నారు.
మహ్మదాబాద్, ఏప్రిల్ 11 : మండల కేంద్రంలోని బస్టాండ్‌లో ఫూలే విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంటరానితనం, బాల్య వివాహాల నిర్మూళనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి ఫూలే అని కొనియాడారు. మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన మానవతావాది, గొప్ప సంఘసంస్కర్త అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శాంతిబాయి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ టౌన్, ఏప్రిల్ 11 : మండలకేంద్రంలోని నారాయణపేట చౌరస్తాలో అంబేదర్ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీహరి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు
భూత్పూర్, ఏప్రిల్ 11 : బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడు మహత్మా జ్యోతిరావుపూలే అని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ అ న్నారు. గురువారం పట్టణంలోని చౌరస్తా వద్ద పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.