మహబూబ్‌నగర్ టౌన్, జూలై 8 : పాలమూరు జి ల్లా కేంద్రాన్ని అత్యంత సుందర పర్యాటక నగరంగా తీ ర్చిదిద్దుతామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మినీ ట్యాంక్‌బండ్ వద్ద నిర్మిస్తున్న స స్పెన్షన్ బ్రిడ్జి పనులను శనివారం మంత్రి పరిశీలించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సస్పెన్షన్ బ్రిడ్జి పనులు దాదాపుగా పూర్తయ్యాయని, ఈ నెలాఖ రు నాటికి ప్రారంభిస్తామన్నారు. మహబూబ్‌నగర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో పనులను చేపడుతున్నామన్నారు. శిల్పారామంలో అతిపెద్ద జాయింట్ వీల్, థీమ్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దక్షిణకొరియాలో వారం రోజులపాటు పలు పర్యాటక ప్రదేశాలను తిలకించామన్నారు. అక్కడి పర్యాటక సౌకర్యాలను శిల్పారామం, ట్యాంక్‌బండ్ వద్ద ఇంకా అధునాతన పద్ధతిలో ఏర్పాటు చేస్తామన్నారు. శిల్పారామంలో వార్ మెమోరియల్, చిల్డ్రన్స్‌పార్క్ నిర్మించనున్నట్లు తెలిపారు. కరీంనగర్, మిడ్‌మానేరు రివర్ ఫ్రంట్ కొండపోచమ్మ సాగర్ తదితర ప్రాంతాలను దక్షిణ కొరియా తరహా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు.
మహబూబ్‌నగర్‌లో ఇండోర్ స్టేడియం పూర్తైందని, త్వరలో జాతీయస్థాయి క్రీడలను నిర్వహిస్తామన్నారు. అనంతరం శిల్పారామం రక్షణ గోడవెంట ఏర్పాటు చేయనున్న వార్ మెమోరియల్, జాయింట్‌వీల్, చిన్నపిల్లల అమ్యూజ్మెంట్ పార్కు, ఇతర సౌకర్యాలపై రూపొందించిన 3డీ సీడీని కార్యక్రమంలో పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, సస్పెన్షన్ బ్రిడ్జి కన్సల్టెంట్ పతంజలి భరద్వాజ, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్లోకి..
మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 8 : జిల్లాలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు వస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బీ జేవైఎం జిల్లా జనరల్ సెక్రటరీ దోమ సాయికుమార్ శ నివారం హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ క్రమశిక్షణతో పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ము న్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు రామలింగం, జాండ్ర సం ఘం నాయకులు పవన్‌కుమార్, బలరాం, భాస్కర్, వెంకటేశ్, ఆనంద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.