మక్తల్ / అలంపూర్ : దేశంలో అణచివేతకు గురవుతున్న మహిళలోకానికి అక్షర లోకాన్ని చూపించి మహిళా జ్యోతులుగా తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు ఫూలే (Jyotirao Phule ) అని బీఆర్ఎస్ ( BRS) మక్తల్ మండల అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకుడు కొత్త శ్రీనివాస్ గుప్తా అన్నారు.
బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిన్న హనుమంత ఆధ్వర్యంలో శుక్రవారం మక్తల్ మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి నివాసంలో జ్యోతిరావు ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జుట్ల శంకర్, సారాయి హనుమంతు, మొగులప్ప, రాములు, అన్వర్ హుస్సేన్, మన్నన్, రామలింగం, రవికుమార్, అశోక్ యాదవ్, జుట్ల సాగర్, నర్సింలు, అమ్రేష్, సాదిక్, చందాపూర్ అశోక్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
అలంపూర్లో..
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ( MLA Vijayudu ) అలంపూర్ చౌరస్తాలో మహాత్మా జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది పూలే అని కొనియాడారు. సామాజిక ఉద్యమాల మార్గదర్శి, చదువు లేనిదే జ్ఞానం లేదు. జ్ఞానం లేనిదే పురోగతి లేదు అనే సత్యాన్ని గ్రహించి 19వ శతాబ్దపు తొలినాళ్లలో నిమ్న జాతులు, మహిళల కోసం దేశంలో మొదటిసారిగా పాఠశాలలను ఏర్పరిచిన మహనీయుడు జ్యోతి రావు ఫూలే అని అన్నారు.