కోస్గి, డిసెంబర్ 11 : కొత్త మండలాల ఏర్పాటుతో గ్రా మాల మహర్దశ మారునుంది. కోస్గి, మద్దూర్ మండలాల నుంచి కొన్ని గ్రామాలను వేరు చేస్తూ గుండుమాల్, కొత్తపల్లి మండలాలు ఏర్పాటయ్యాయి. మద్దూర్ మండలం నుంచి 11 గ్రామ పంచాయతీలను వేరు చేసి కొత్తపల్లి మం డలాన్ని ఏర్పాటు చేశారు. గతంలో మద్దూర్ మండలానికి 49 గ్రామ పంచాయతీలు ఉండడంతో జిల్లాలోనే పెద్ద మండలంగా ఉండేది. మండల అధికారులు ఒకేరోజు మండలంలో పర్యటించాలంటే ఇబ్బందిగా ఉండేది. 11 గ్రామ పంచాయతీలను వేరు చేసి కొత్త మండలం ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలకు మేలు జరగనుంది.
గుండుమాల్ మండలాన్ని కోస్గి మండలం నుంచి 10 గ్రామ పంచాయతీలను వేరుచేసి కొత్త మండలం ఏర్పాటు చేశారు. ఇలా చిన్న మండలాలతో ప్రజలకు మెరుగైన సేవలందనున్నాయి. 10, 11 గ్రామ పంచాయతీలకు అన్ని శాఖల మండల అధికారులు ఉండడంతో ప్రజల పనులు సకాలంలో పూర్తికానున్నాయి. గతంలో కొన్ని పనులు మండల స్థాయిలో గ్రామ పంచాయతీలు అధికంగా ఉండడంతో పనులు సకాలం లో పూర్తయ్యేవికావు.
దీంతో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రె డ్డి చొరవతో సీఎం కేసీఆర్ సహకారంతో కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. మండలశాఖ అ ధికారుల నియామకమై పరిపాలన ప్రారంభమైం ది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు హ ర్షం వ్యక్తం చేస్తున్నారు.
గుండుమాల్ మండలం కావాలని ఎన్నో ఏండ్లుగా ప్రజాప్రతినిధులు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయింది. కానీ కొడంగల్ ఎమ్మెల్యేగా పట్నం నరేందర్రెడ్డి గెలిచాక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గుండుమాల్ మండలం ఏర్పాటైంది. అదేవిధంగా పక్కనున్న మద్దూర్ మండలంలో కొత్తపల్లిని మండలంగా ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంత ప్రజలమంతా బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటాం. – మధుకర్రావు, ఎంపీపీ కోస్గి