గద్వాల టౌన్, సెప్టెంబర్ 16 : సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని అహింసా మార్గంలో ఎందరో వీరులు పోరాటాలు చేసి, ప్రాణాలు ధారపోసి 1947లో భారతావనికి స్వాతంత్య్రా న్ని సాధించి పెట్టారు. కానీ ఆ భాగ్యం దక్షిణాదిన ఉన్న నిజాం రాజ్యంలోని ప్రజలకు మాత్రం అందనంత దూరంలో ఉండిపోయింది.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత నిజాం రాజు తన రాజ్యాన్ని స్వతంత్య్ర రాజ్యంగా ప్రకటించాడు. దే శంలోని అన్ని సంస్థానాలు భారత యూనియన్‌లో విలీనమయ్యేందు కు సుముఖత వ్యక్తం చేశాయి. కానీ కాశ్మీర్, జా నాఘడ్, ని జాం రాజ్యాలు అందుకు ససేమిరా అన్నాయి. దీంతో తెలంగాణ ప్రాంతంలో భారత్‌లో విలీనం చేయాలని ప్రత్యేక పో రాటాలు జరిగాయి.
ఈ పోరాటాల్లో నడిగడ్డ పాత్ర ఎంతో కీలకం. అలాగే గద్వాల మహారాణి చూపిన చొరవ ఎంతో సాహసోపేతమైందిగా ఇప్పటికీ కథలుగా చెప్పుకొంటారు. 13 నెలల సుధీర్ఘ పోరాటం సాగించాక పోలీస్ చర్యలతో నిజాం రాజ్యం భాతర యూనియన్‌లో 1948 సెప్టెంబర్ 17న విలీనమైంది. ఈ ఉద్యమంలో నడిగడ్డ ప్రాం తానికి చెందిన ఎందరో మహానుభావులు వీరోచితమైన పోరాటాలు చేశారు. ఆ పోరాటాలను మరోసారి మనం గుర్తుకు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
17న నిజాం లొంగుబాటు
భారతావనిలో స్వాతంత్య్ర సంబురాలు అంబరాన్ని అంటేలా జరుగుతున్న తరుణంలో నిజాం రాజ్యంలో రజాకార్ల ఆకృత్యాలు మితిమీరి పో యాయి. భారత్ యూనియన్‌లో నిజాం నవా బు చేరేందుకు ఇష్టపడక పోవడంతో పాటు కాసీం రజ్వీ నేతృత్వంలోని రజాకారులు తెలంగాణలోని పల్లెల్లో పడి ఆస్తులు దోచుకోవడంతోపాటు మహిళల మానాలను దోచుకున్నా రు.
ఈ క్రమంలో భారత్ యూనియన్‌లో క లుపడానికి నిరాకరించిన రాజ్యాలను విలీ నం చేసేందుకు కేంద్ర స్థాయిలో పండిత్ జవహార్‌లాల్ నెహ్రూ నేతృత్వంలో సభ లు, సమావేశాలు నిర్వహించారు. నిజాం రాజ్యాన్ని విలీనం చేసే బాధ్యతను నాటి హోంమంత్రి సర్ధార్ వల్లబభాయ్ పటేల్ తీసుకున్నారు. నిజాం రాజులతో సంప్రదింపులు జరిపినా వారు అంగీకరించలేదు. మరోవైపు పాకిస్తాన్ వైపు ని జాం ఆకర్షితుడు కావడంతో సర్ధార్ పోలీస్ చర్యకు దిగా రు. సెప్టెంబర్ 13న పోలీస్ చర్యను ప్రారంభించగా 17న పటేల్ ముందు నవాబు లొంగిపోయాడు.
విమోచనలో నడిగడ్డ పాత్ర..
నాటి నిజాం రాజ్యంలో నడిగడ్డలోని అనేక గ్రామాలు నిజాం దుశ్చర్యలను ఎదిరించి పోరాడాయి. రజాకారుల దౌర్జన్యాలను, దేశ స్వా తంత్య్ర సంగ్రామానికి బాసటగా నిలిచాయి. పాలమూరు జిల్లా లో పోరాట ఘట్టాలు అనేకం ఉన్నా నడిగడ్డలో జరిగిన మూడు సం ఘటనలు నాటి ఉద్యమ స్ఫూర్తికి గుర్తులుగా మిగిలాయి. 1927 నుంచి 1947 పోలీస్ చర్య వరకు జరిగిన అనేక సంఘటనల గురిం చి భావితరాలకు తెలయకపోవచ్చు. కానీ ఆనాడు ప్రజలకు ఇచ్చిన నాటి స్ఫూర్తిని, ఉద్యమ బాట పట్టడానికి దోహదపడుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
1927లో తేరుమైదానంలో జరిగిన జాతీ య జెండావిష్కరణ, 1947లో అయిజలో జరిగిన లెవీ సహాయ ని రాకరణ ఉద్యమం.. ఈ ఉద్యమంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు రైతులు బలయ్యారు. 1948లో గద్వాల సంస్థానాధీశురాలు మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ పోలీస్ చర్యకు అనుకూలంగా నాటి హో ంమంత్రి పటేల్‌కు ఉత్తరం రాయడం లాంటి ఘటనలు నడిగడ్డ ప్రజ లు స్వాతంత్య్ర కోసం ఎంతగా ఉబలాటపడ్డారో అర్థమవుతుంది.
అలాగే నిజాం పరిపాలనను ఎదిరించి ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు అజ్ఞాత భాగ్యనగర్ రేడియో పేరిట క ర్నూల్ కేంద్రంగా జరిగిన ప్రసారాలు ప్రజలను ఉత్తేజవంతులను చేసి విమోచన ఉద్యమంలో భాగస్వాములను చేసింది. కర్నూలు నై జాం రైలు వస్తున్న సమయంలో ఇటిక్యాల రైల్వే స్టేషన్‌ను కాల్చడం, ఇటిక్యాల నుంచి మానవపాడు స్టేషన్ వరకు ఉన్న పట్టాలను తొలగించడం, రైల్వే టెలిఫోన్ వైరింగ్ కత్తరించడం వంటి విధ్వంసకర కార్యక్రమాలు ప్రజలను సంఘటితం చేశాయి. నడిగడ్డ తెలంగాణ ఉద్యమంలో స్వామి రామానందతీర్థ, హయగ్రీవచారి ప్రముఖ పాత్ర పోషించారు.
నాయకులది ముఖ్య పాత్ర
తెలంగాణ ఉద్యమ పోరాటంలో గద్వాల మహారాణితో పాటు నడిగడ్డకు చెందిన ఎందరో మహానుభావులు పాల్గొన్నారు. వారిలో పాగపుల్లారెడ్డి ముఖ్యుడు. ఈయన ఆధ్వర్యంలో భాగ్యనగర్ రేడియో పో రాటం ఎంతో చెప్పుకోదగ్గది. పుల్లారెడ్డితోపాటు గద్వాలకు చెందిన వీరభద్రారావు, రామచంద్రరావు ఉద్యమంలో కీలక ప్రాత పోషించా రు. తెలంగాణ విమోచనంలో ముఖ్య పాత్ర వహించారు. అలాగే గొ ట్టి ముక్కుల కృష్ణమూర్తి, గడియారం రామకృష్ణ, నాగప్ప, కమ తం వెంకటరెడ్డి, పట్టాభి సీతారామయ్య, గురరాజచారి, గిడ్డయ్య, నల్లారెడ్డి, ఇలా ఎందరో మహానుభావులు భాగస్వాములయ్యారు.