
మహబూబ్‌నగర్: దసరా పండుగను కనులపండువగా ఘనంగా నిర్వహించుకుందామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివా స్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడిలోని ఆర్యసమాజ్ దయానంద విద్యామందిర్‌లో ఏర్పాటు చేసి న దసరా ఉత్సవ కమిటీ సమావేశానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై కమిటీ సూచనలు, సలహాలు తీసుకుని మాట్లాడారు. గత సంవత్సరం కరోనా ప్రభావం అధికంగా ఉండడం వల్ల దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకోలేకపోయామని ఈ ఎడాది నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకుందామని సూచించారు.
కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ మురళీధర్ రావు, కార్యదర్శి ముత్యాల ప్రకాశ్, కోశాధికారి జేపీ ఎన్సీఈ రవికుమార్, మున్సిపల్ చైర్మన్ కేసీ. నర్సిహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, బుర్జు రాజేందర్‌రెడ్డి, బుర్జు సుధాక ర్‌రెడ్డి, నల్లమద్ది సురేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, చెరు కుపల్లి రాజేశ్వర్, సుదీప్‌రెడ్డి, రామంజనేయులు, గౌలీవీరు తదితరులు పాల్గొన్నారు.