మహబూబ్‌నగర్‌టౌన్/నవాబ్‌పేట, జూలై 20 : నవాబ్‌పేట మండలంలోని పోమాల గ్రా మానికి చెందిన విద్యార్థిని బి.అపర్ణను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. మహబూబ్‌నగర్ జేపీఎన్సీఈ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న అపర్ణ రాష్ట్ర స్థాయిలో గూగుల్ సంస్థ నిర్వహించిన పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విభాగాల ప్రతిభా పరీక్షల్లో ఐదో ర్యాంకు సాధించింది. గూగుల్ సర్టిఫికేషన్ కోర్స్ ప్రోగ్రాంకు ఎంపికైంది. బుధవారం టీ హబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అపర్ణకు మంత్రి కేటీఆర్ ప్ర శంసాపత్రం అందజేసి అభినందించారు. కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ సర్టిఫికెట్ ప్రోగ్రాంకు ఎంపికావడం సంతోషంగా ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ సుజీవన్‌కుమార్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, ప్లేస్మెంట్ అధికారి గురురాఘవేంద్రరెడ్డి, సమన్వయకర్త ప్రవీణ్‌కుమార్ అపర్ణను అభినందించారు.