మహబూబ్‌నగర్‌టౌన్, మే 11: మహబూబ్‌నగర్‌ను సుందరపట్టణంగా తీర్చిదిద్దుతామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మినీట్యాంక్‌బండ్ పూడికతీత పనులను అడిషనల్ కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం హనుమాన్‌పురలో రూ.22లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు, మైత్రినగర్‌లో రూ. 13.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించా రు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పెద్దచెరువు చు ట్ట్టూ నెక్లెస్‌రోడ్డు అభివృద్ధి, శిల్పారామం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మినీట్యాంక్‌బండ్ పనులు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతివార్డులో అభివృద్ధ్ది పనులు చేపట్టామని, మరిన్ని పనులు చేపడుతున్నామని తెలిపారు. పట్టణంలో రోడ్డువిస్తరణతోపాటు జంక్షన్లు అభివృద్ధి చేశామని, హైదరాబాద్ తరహాలో మహబూబ్‌నగర్‌ను మహానగరంగా అభివృద్ధ్ది చేస్తామని మంత్రి వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్‌చైర్మన్ తాటిగణేశ్, కౌన్సిలర్లు షేక్ఉమర్, తిరుపతమ్మ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, నాయకులు అన్వర్‌పాషా, నవకాంత్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
ప్రత్యేక పూజలు చేసిన మంత్రి
జగద్గురు వీరబ్రహ్మేంద్రస్వాములవారి ఆరాధనోత్సవాలను బుధవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై వీరబ్రహ్మేంద్రస్వామికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఆలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. దేశం లో ఏప్రభుత్వం కూడా ప్రభుత్వ నిధులతో ఆలయాన్ని నిర్మించలేదని సీఎం కేసీఆర్ యాదాద్రిని నిర్మించారని పేర్కొన్నారు. అనంతరం రూ.5లక్షలతో నిర్మించిన ప్ర హరీని, గేటును మంత్రి ప్రారంభించారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. సాయం త్రం 5గంటలకు స్వామివారికి సుప్రభాతసేవతోపాటు పలుపూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ము న్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్‌చైర్మన్ తాటి గణే శ్, ఆలయకమిటీ చైర్మన్ వడ్ల శేఖర్, కమిటీసభ్యులు ప్రభాకరాచారి, బ్రహ్మయ్య, నారాయణ, కౌన్సిలర్ పాషా తదితరులు పాల్గొన్నారు.