మద్దూర్, మే 11 : టీఆర్ఎస్ హయాంలోనే కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చెం దిందని, ప్రజలు సైతం టీఆర్ఎస్ వెంటే ఉన్నారని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నా రు. మండలంలోని చెన్నారెడ్డిపల్లిలో బుధవారం మన ఊరు- మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీకు ఎప్పుడు ఏసమస్య వచ్చినా ఆదుకునేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ప్రభుత్వపథకాలు ప్రతిఇంటికీ చేర్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం కలెక్టర్ హరిచందనతోకలిసి గ్రామంలోని వైకుంఠ ధామన్ని, వాటర్ ట్యాంక్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గ్రామంలోని పలువురు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ జగదీశ్వర్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దవీరారెడ్డి, సర్పంచ్ అనిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటయ్య, నాయకులు హన్మిరెడ్డి, బసిరెడ్డి, శేఖర్, గోపాల్‌తోపాటు వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.