గట్టు, మే 11 : ఉమ్మడి గట్టు మండల రైతులు ఏండ్లు గా ఎదురుచూస్తున్న గట్టు ‘నలసోమనాద్రి’ ఎత్తిపోతల కల నెరవేరనున్నది. పనులకు ఈనెల 18న శ్రీకారం చుట్టనున్నారు. కాగా ఎత్తిపోతల ప్రతిపాదిత ప్రాంతం మల్లాపురంతండా సమీపంలోని గజ్జలమ్మగట్టు ప్రాం తాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జీవీఆర్ సంస్థ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. భూమిపూజతోపాటు సమావేశ ప్రాంతాన్నిచూసి ఎంపిక చేశారు. పనులను మొదలు పెట్టే ప్రాంతాన్ని కూడా గుర్తించా రు. 1.32టీఎంసీల సామర్థ్ధ్యంతో నలసోమనాద్రి ఎత్తిపోతలను నిర్మించి గట్టు, కేటీదొడ్డి మండలాల్లోని 33 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ విజయకుమార్, కేటీదొడ్డి జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్‌ఎంపీపీ రా మకృష్ణనాయుడు, టీఆర్ఎస్ నాయకులు హనుమం తు, రామకృష్ణారెడ్డి, ఇరిగేషన్అధికారులు పాల్గొన్నారు.