మహబూబ్‌నగర్, మే 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంటున్నది. కరోనాతో సుమారు రెండేండ్లపాటు ఇబ్బందులను ఎదుర్కొన్న రియల్ వ్యాపారం ఇప్పుడు ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ అన్న చందంగా విస్తరిస్తున్నది. ముఖ్యంగా పాత మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో రియల్ వ్యాపారానికి ఆకాశమే హద్దుగా మారింది. హైదరాబాద్‌లో ధరలు అందుబాటులో లేకుండాపోయాయి. మరోవైపు నగరం మూడు వైపులా ఇప్పటికే భారీగా విస్తరణ జరిగింది. అయితే, దక్షిణ ప్రాంతంలో ఉన్న పాత మహబూబ్‌నగర్ జిల్లా దిశగా ఇప్పుడిప్పుడే రియల్ రంగం రివ్వుమని దూసుకుపోతున్నది. షాద్‌నగర్ చుట్టూ రియల్ ఎస్టేట్ విస్తరణ భారీగా జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే దిశగా భూములు, స్థలాలకు గతంలో ఎప్పుడు లేనంత డిమాండ్ పెరిగింది.
ఇక జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్ వరకు, మహబూబ్‌నగర్ నుంచి భూత్పూర్ వరకు ట్రయాంగిల్ రూపంలో స్థిరాస్తి వ్యాపారం భారీగా జరుగుతున్నది. అన్ని వైపులా హైవేలు విస్తరిస్తుండం మహబూబ్‌నగర్ జిల్లాకు అదనపు ఆకర్షణగా మారింది. హైదరాబాద్- బెంగళూరు, కోదాడ-మహబూబ్‌నగర్-రాయిచూరు హైవేలు రియల్ వ్యాపారానికి డెస్టినేషన్‌గా మారాయి. పోలేపల్లి సెజ్ జడ్చర్ల, మహబూబ్‌నగర్ పట్టణాలకు తలమానికంగా మారింది. ఈ సెజ్‌లో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరికీ స్థానికంగా నివాస సౌకర్యం కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక కొత్తగా ఏర్పడుతున్న దివిటిపల్లి ఐటీ పార్కు సైతం కలిసొచ్చింది. జాతీయ రహదారిని ఆనుకొని భారీగా వెంచర్లు వెలుస్తున్నాయి.
స్థానికులే కాకుండా హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారులు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. వీటన్నింటికీ తోడు ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు పాత మహబూబ్‌నగర్ జిల్లాను ఆనుకునే వెళ్తున్నది. ట్రిపుల్ ఆర్ నుంచి జడ్చర్ల కూతవేటు దూరంలో ఉన్నది. అంతర్జాతీయ విమానాశ్రయం కూడా జడ్చర్ల నుంచి కేవలం 45 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇక ఇటీవలే మహబూబ్‌నగర్-సికింద్రాబాద్ రైల్వే లేన్ డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ కూడా పూర్తి కావడంతో రైళ్ల సంఖ్య భారీగా పెరిగి మహబూబ్‌నగర్, జడ్చర్ల నుంచి కేవలం గంటలోనే హైదరాబాద్ చేరుకునే వెసులుబాటు ఏర్పడింది. ఈ సదుపాయాలన్నీ మహబూబ్‌నగర్ జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా వృద్ధి చెందేందుకు అవకాశం కలిగిస్తున్నాయి. 2014 జూన్2 కంటే ముందు వరకు జిల్లాలో రియల్ వ్యాపారం మందకొడిగా సాగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఊపందుకున్నది. ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఊహించని స్థాయిలో రియల్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది.
మహబూబ్‌నగర్, జడ్చర్ల పట్టణాల్లో రోడ్లు, మౌలిక వసతులు, విద్య, వైద్యం సహా సకల సదుపాయాలు అందుబాటులోకి రావడంతో ఇక్కడ స్థిర నివాసానికి చక్కని వేదికగా మారింది. ఈ తరుణంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అన్ని అనుమతులున్న ఇంటి స్థలాలు, ఇండ్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు తీసుకోవాలనే వారి కోసం ఈ నెల 14, 15 తేదీల్లో రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న సుదర్శన్ ఫంక్షన్ హాల్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు జోగుళాంబ గద్వాల జిల్లాలోనూ రియల్ రంగం ఊపందుకుంటున్నది. జాతీయ రహదారిని ఆనుకుని ఉండే ఎర్రవల్లి చౌరస్తా వద్ద నూతన వెంచర్లు భారీగా వెలుస్తున్నాయి. గద్వాల నుంచి ఎర్రవల్లి వరకు భూములు అందుబాటులో లేని స్థాయికి చేరుకున్నది. కర్నూల్‌కు సమీపంలో ఉండడంతో ఎర్రవల్లి వద్ద స్థిరాస్తి రంగం ఊపందుకున్నదని స్థానికులు చెబుతున్నారు.
ఊహించని స్థాయిలో అభివృద్ధి..
జడ్చర్ల ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందుతున్నది. వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన పోలేపల్లి సెజ్ జడ్చర్లకే తలమానికంగా మారింది. ఇక్కడ దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాలకు చెందిన అనేక మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక బెంగళూరు హైవేను ఆనుకొని దివిటిపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న ఐటీ పార్కుతో ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయి. త్వరలో జాతీయ రహదారి 6 లేన్లుగా విస్తరిస్తుండడంతో ప్రయాణం మరింత వేగవంతంగా సాగేందుకు అవకాశం ఏర్పడింది. ఇక సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు రైల్వే డబుల్ లేన్ నిర్మాణంతో భవిష్యత్తులో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరగనున్నది. వీటన్నింటితోపాటు మహబూబ్‌నగర్ జిల్లాను ఆనుకొని రాబోతున్న ట్రిపుల్ ఆర్తో కొత్తరూపు సంతరించుకోనున్నది. ఈ తరుణంలో జడ్చర్ల ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారం కొత్తపుంతలు తొక్కుతున్నది. కొత్తగా ఇండ్లు నిర్మించుకునే వాళ్లంతా ఎలాంటి చీకూ చింత లేని, సకల సదుపాయాలున్న ఓపెన్ ప్లాట్ల కోసం ప్రయత్నిస్తున్నారు.
అలాంటి వారి కోసమే ఐటీ పార్క్, పోలేపల్లి మధ్య జడ్చర్ల బస్టాండ్‌కు సమీపంలో హైవేను ఆనుకొని 70 ఎకరాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా గోల్డెన్ ప్రైడ్ పేరిట లగ్జరీ ప్లాట్లను సిద్ధం చేశాం. డీటీసీపీ, రెరా అనుమతులున్న ఈ వెంచర్లో 80 ఫీట్ల అంతర్గత సీసీ రోడ్లు, పార్కులు, గ్రీనరీ, డ్రైనేజీ సిస్టం తదితర సకల సదుపాయాలతో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ గృహాలు నిర్మించుకునేందుకు అనువైన ప్లాట్లు ఆకట్టుకుంటున్నాయి. భవిష్యత్తులో ఊహించని స్థాయిలో అభివృద్ధికి అవకాశమున్నందునే జడ్చర్ల సిరిసంపద వెంచర్‌కు మేం ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన వస్తోంది. జడ్చర్ల ప్రాంతంలో 70 ఎకరాల్లో ఉన్న ఏకైక వెంచర్ మాదే అని గర్వంగా చెబుతున్నాం. త్వరలోనే మా వెంచర్లో ఊహించని విధంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ సైతం ఏర్పాటు చేయబోతున్నాం.
– రాజ్‌కుమార్ మాగంటి, ఎండీ,ప్రదీప్‌కుమార్ మాగంటి, చైర్మన్, సిరిసంపద గ్రూప్
మహబూబ్‌నగర్‌కు భారీ డిమాండ్..
హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తున్నది. ఎటు చూసి నా వంద కిలోమీటర్ల మేర నగరం వ్యాప్తి చెందుతున్నది. ఇ ప్పటికే నగరం నలుమూలలా విస్తరణ జరుగుతున్నది. ప్రస్తు తం బెంగళూరు హైవే దిశగా స్థిరాస్తి కొనుగోలుకు అత్యంత అనుకూలంగా ఉన్నది. నగరంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే పాత మహబూబ్‌నగర్ జిల్లా ఇప్పుడు అత్యంత వే గంగా అభివృద్ధి చెందుతున్నది. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారి 6 లేన్ విస్తరణతోపాటు పారిశ్రామిక కారిడార్‌గా మారుతుండడంతో నగరం నుంచి జడ్చర్ల వరకు ఇ ప్పటికే విపరీతమైన డిమాండ్ వచ్చింది. షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లోనే భూములు, స్థలాల ధరలు తక్కువగా ఉన్నాయి.
ఫలితంగా ఈ ప్రాంతం స్థిరాస్తి రంగంలో అనుకూలంగా మారింది. బెంగళూరు హైవేకు చేరువలో ఉన్న ఎర్రవల్లి నుంచి గద్వాల దిశగానూ రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. గద్వాల జిల్లా కేంద్రంగా మారడం, కర్నూల్‌కు సమీపంలోనే ఉండడంతో ఎర్రవల్లి వద్ద కూడా స్థిరాస్తి వ్యాపారం ఊహించని స్థాయిలో ఉన్నది. షాద్‌నగర్ టోల్గేట్ వద్ద 200 ఎకరాల్లో ఆరం భ్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్లు, ఎర్రవల్లి సమీపంలో గద్వాల రోడ్డులో 35 ఎకరాల్లో ఆదిత్రి ఓపెన్ ప్లాట్లు సకల సదుపాయాలతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దాం. ఈ రెండిట్లోనూ అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ ప్రత్యేకం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, విశాలమైన రోడ్లు, నీటి సరఫరా, వర్షపు నీటి వ్యవస్థ వంటి మిగతా సౌకర్యాలన్నీ కూడా అందుబాటులో ఉంచాం. ఇప్పటికిప్పుడు ఇండ్లు నిర్మించుకునేందుకు సరిపడా ఏర్పాట్లున్నాయి.
– సురేశ్ కుమార్‌రెడ్డి, ఎండీ, స్కంధాన్షి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్