మహబూబ్‌నగర్, మే 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాం గ్రెస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డి వ్యవహారశైలిపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తమ పార్టీకి చెందిన మ హిళా నేతపై శివకుమార్‌రెడ్డి లైంగికదాడికి పాల్పడినట్లు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావ డంతో సదరునేత తీరుపై స్థానికం గా చర్చించుకుంటున్నారు. గతంలోనూ ఓ మాజీ మహిళా ప్రజాప్రతినిధితో వివాహేతర సంబంధం ఉందంటూ నారాయణపేట పట్ట ణంలో కరపత్రాలు పంపిణీ చేయ డం సంచలనం సృష్టించింది. నారాయణపేటలోని పార్టీ కార్యాలయం వద్ద శివకుమార్‌రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఏడాది కిం దట కాంగ్రెస్ పార్టీకే చెందిన కొం దరు మహిళా నేతలు వీడియో ద్వా రా వెల్లడించారు. ఆ తర్వాత సద రు బాధిత మహిళల ఆడియో సో షల్ మీడియాలో వైరల్ అయింది. శివకుమార్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ అ ధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేసి నా కూడా చర్యలు తీసుకోలేదని స్థానికంగా చెబుతున్నారు.
ఇప్పు డు మహిళా నేతను బెదిరించి లైంగిక దాడి చేయడంపై నారాయణపేట వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. మ హిళలపై అఘాయిత్యాలకు పాల్ప డేవారు ప్రజాజీవితంలో ఉండేందుకే అర్హత కోల్పోయారని స్థానికు లు చర్చించుకుంటున్నారు. కాంగ్రె స్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాం ధీ ఇటీవల పబ్బుల్లో మహిళలతో చిందులు వేస్తూ మీడియా కంటికి చిక్కడంతో ఆ పార్టీ విశ్వసనీయత పై జనంలో చర్చ మొదలైంది. పేట డీసీసీ అధ్యక్షుడి వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ నేతలు తమ విశృంఖల ప్రవర్తనతో జనం ముందు తేలిపోతున్నారు.