మక్తల్ టౌన్, మే 10 : చదువుతోపాటు క్రీడల్లోనూ రా ణించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో జరిగిన జిల్లా అథ్లెటిక్స్ క్రీడల్లో హైజంప్, లాంగ్‌జంప్, రన్నింగ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో పట్టణానికి చెందిన భరత్, రాజు, తిరుపతి, కృష్ణ, అమ్రేశ్, ధనుశ్రీ, మహేశ్ ప్రతిభ కనబర్చగా వారికి ఎమ్మెల్యే తన నివాసంలో మంగళవారం మెమోంటోలు అందజేసి శాలువాలతో స న్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ క్రీడాకారులకు తమవంతు సహాయ సహకారా లు ఉంటాయని పే ర్కొన్నారు. క్రీడాకారాలకు ఏ అవసరం ఉన్నా తనను సంప్రదించవచ్చన్నారు.
యువత క్రీడల్లో పాల్గొనడం వల్ల ఏకాగ్రత పెరుగుతున్నదన్నారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రా ణించిన వారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన క్రీడాకారులు అని, యువత వారిని ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో రాణించాలన్నారు. పట్టణంలో అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపిక అ య్యో విధంగా కృషి చేసిన కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జగదీశ్‌ను అభినందించారు. ఈనెల 14న హైదరాబాద్‌లోని గ చ్చిబౌలి స్టేడియంలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో క్రీడాకారులు రాణించి మరింత ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే అన్నా రు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ జిల్లా అధ్యక్షుడు పి. నర్సింహాగౌడ్, రాకేశ్, మాజీ ఎంపీటీసీ రవిశంకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.