నవాబ్‌పేట, మే 10 : పొలాలను సారవంతం చేసేందుకు గానూ ప్రభు త్వం సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తోందని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. నవాబ్‌పేట మండల కేంద్రంలో మంగళవారం రైతులకు సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రసాయన ఎరువులు వేయడం వల్ల భూ ము లు సారాన్ని కోల్పోతున్నాయని పేర్కొన్నారు. అందుకే తెలంగాణ ప్రభు త్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 65 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తోందన్నారు. జీలుగ విత్తనాలు పొలం లో సాగు చేసిన 40రోజులకు దున్నివేసి వరిపంట సాగుచేస్తే మంచి దిగుబడి వస్తుందన్నారు. రైతులు ఈ అ వకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్చర్ల ఏడీఏ ఆం జనేయులు, స్థానిక ఎంపీపీ అనంత య్య, సింగిల్‌విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, మండల వ్యవసాయాధికారి కృష్ణకిశోర్, సర్పంచ్ గోపాల్‌గౌడ్, ఎంపీటీసీ రాధాకృష్ణ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, ముడా డైరెక్టర్ గండు చెన్నయ్య, నా యకులు శేఖర్‌రెడ్డి, శ్రీశైలం, ఏఈవోలు నరే శ్, శశిత, గౌతమి, బత్రుహరి, వివిధ గ్రా మాల రైతులు పాల్గొన్నారు.