మరికల్, మే 10 : మరికల్ తాసిల్దార్గా పని చేయడానికి తాసిల్దార్లు జంకుతున్నారు. జనవరి నుంచి ఇప్పటి వ రకు నలుగురు తాసిల్దార్ల్లో ఇద్దరు ఏసీబీ అధికారులకు ప ట్టుబడగా మరో ఇద్దరు నెల రోజుల్లోనే బదిలీ కావడంతో మండలంలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎం తో మంది తాసిల్దార్లు ఉత్సాహంగా ఉన్న మారిన పరిస్థితు ల్లో ఇక్కడ పని చేయడానికి అధికారులు భయపడుతున్నా రు. జనవరిలో ఒకరు, మార్చిలో మరొకరు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో ఇన్చార్జీగా వచ్చిన డీటీ శ్రీనివాసులు కేవలం రిజిస్ట్రేషన్ల వరకు మాత్రమే వచ్చి నాలుగు రోజుల్లోనే బదిలీ అయ్యారు.
ఏప్రిల్ 13న నూతనంగా వచ్చిన తాసిల్దార్ నెల తిరుగకముందే బదిలీ కావడంతో మరికల్ తాసిల్దార్గా ఎవరూ రావడానికి సుముఖంగా లేరని సమాచారం. తరుచుగా తా సిల్దార్లు బదిలీ అవుతుండడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. అలాగే ప్రస్త్తుతం ప్రభుత్వం ఉ ద్యోగ ప్రకటనలు వేయడంతో యువత కుల, ఆదాయం ధ్రువీకరణ సర్ట్టిఫికెట్లు తీసుకోవడానికి తాసిల్దార్ కార్యాల యం చుట్టూ ప్రదర్శనలు చేస్త్తున్నారు. రెండు నెలల కింద ట కార్యాలయంలో కల్యాణలక్ష్మి దరఖాస్తులు కూడా లేవని బాధితులు వాపోతున్నారు. మరికల్ తాసిల్దార్ కార్యాల యం అంటేనే అధికారులు ఎందుకు భయపడుతున్నారో వారికే తెలియాలి. ఇప్పటికైనా కలెక్టర్ కల్పించుకొని మరికల్ తాసిల్దార్గా సమర్థవంతులైన అధికారిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు.