వనపర్తి రూరల్, మే 8: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అప్పాయిపల్లి శివారులో నాగవరం స హకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పా టు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీ చైర్మన్ ఎంపీపీ కిచ్చారెడ్డి, సహకార సంఘం చైర్మన్ మధుసూదన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కష్టాలను తీర్చేందుకే ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. అకాల వర్షాలు వచ్చే ప్రమాదం ఉన్నందున కొనుగోళ్లలో వేగం పెంచాలన్నారు. కార్యక్రమంలో రైతులు, నాయకులు పాల్గొన్నారు.
అప్పారెడ్డిపల్లిలో..
ఖిల్లాఘణపురం, మే 8: మండలంలోని అప్పారెడ్డిపల్లిలో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని సర్పంచ్ కృష్ణవేణి, ఎంపీటీసీ మల్లేశ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో కార్యదర్శి ప్రకాశ్, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.
కేశంపేటలో..
రేవల్లి, మే 8: మండలంలోని కేశంపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ బంకల సేనాపతి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రానికి నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బీరమ్మ, సింగిల్‌విండో డైరెక్టర్ రాంబాబు, నాయకులు రఘురామారావు, రాంకిషన్‌రావు, బంకల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు