గద్వాల, మే 8 : వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు సీఎం సహాయనిధి వరంలాంటిదని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేటీదొడ్డి మండలానికి చెందిన దమయంతి చికిత్సనిమిత్తం మంజూరైన రూ. 60వేలు, మల్లేశ్ చికిత్సనిమిత్తం మంజూరైన రూ. 26,500, గట్టు మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన జయన్నకు మంజూరైన రూ.60వేల చెక్కులను వారి కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. పేదలు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడు తూ చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి సీఎం సహాయ నిధి ఒక వరం లాంటిందని తెలిపారు. ప్రభుత్వం అందిం చే సహాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గట్టు ఎంపీపీ విజయ్‌కుమార్, కేటీదొడ్డి జెడ్పీటీసీ రాజశేఖర్, నాయకులు తిమ్మప్ప, మహేశ్‌గౌడ్, చక్రాధర్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దళితుల అభివృద్ధికి కృషి
మల్దకల్, మే 8 : రాష్ట్రంలో దళితులకు ప్రత్యేకంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకే సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని నీలిపల్లి గ్రామంలో ఆదివారం దళితబంధు పథకం ద్వారా లబ్ధిపొందిన లబ్ధిదారుడు కిష్టన్న మినీ రైస్‌మిల్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అలాగే చర్లగార్లపాడు గ్రామానికి చెందిన కర్రెన్న కోళ్లపామ్ షెడ్డు నిర్మాణానికి కూడా ఎమ్మెల్యే భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా దళితులకు ప్రత్యేకంగా పథకాలు పెట్టలేదని, వారి అభ్యున్నతికి కృషి చేయలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దళితులకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు నిధులు ఇచ్చి వారిని ఆర్థికం గా ఎదిగేందుకు కృషిచేస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు విజయ్, కేటీదొడ్డి జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్‌ఎంపీపీ పెద్దవీరన్న, సింగిల్‌విండో వైస్ చైర్మన్ విష్ణు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటన్న, నా యకులు అజయ్, మధు, భాస్కర్, ఆంజనేయులు, నారాయణతోపాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.