రేవల్లి, మే 8: వనపర్తి కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మొదలాయ్యా యి. పార్టీలోని తన అభిమానులు, కార్యకర్తలను దూరం పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపి స్తూ నాగపూర్‌కు చెం దిన ప్రముఖ రియల్ఎస్టేట్ వ్యాపారి, సినీనిర్మాత నాగం తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన అభిమానులు, కార్యకర్తలతో నాగపూర్‌లో ఆదివారం సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు హాజరయ్యారు. నియోజకవర్గ ఇన్చార్జి చి న్నారెడ్డి తన సేవలు వినియోగించుకున్నారని గు ర్తు చేశారు. ఇప్పుడు తానెవరో తెలియనట్లు వ్యవహరిస్తూ అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చే శారు.
పార్టీలో కార్యకర్తలు, అభిమానులు పుష్కలంగా ఉన్నా నాయకత్వ లేమివల్ల వారు చెల్లాచెదురయ్యారన్నారు. మండల మాజీ కో ఆప్షన్ సభ్యుడు సుల్తాన్ అలీ, మండల మాజీ అధ్యక్షుడు శంకర్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలను పట్టించుకోని పార్టీకి జీవంపోస్తున్న నాయకుడు నాగంను విస్మరిస్తే కాంగ్రెస్‌కు పుట్టగతులుండవని అన్నారు. సమావేశంలో మాజీ సర్పంచులు శంకర్‌నాయక్, బాలస్వామి, సుబ్బారెడ్డి, నాగరాజు, నాయకులు మురళీధర్‌గౌడ్, దొడ్డి కుర్మయ్య, విష్ణు, వెంకటేశ్వర్లు, మిద్దె రాములు తదితరులు పాల్గొన్నారు.