మహబూబ్‌నగర్ రూరల్, మే 8 : దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ మండలం జమిస్తాపూర్‌లో ఆదివారం నిర్వహించిన బొడ్రాయి, మైసమ్మ విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాన్ని గ్రామస్తులందరూ కనులపండువగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతిఒక్కరూ భక్తిభావం అలవర్చుకొని సన్మార్గంలో పయనించాలని సూ చించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, ముడా డైరెక్టర్ కాడం ఆంజనేయులు, సర్పంచ్ రాంచంద్రయ్య, ఉపసర్పంచ్ మొగులయ్య, ఎంపీటీసీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
హన్వాడ, మే 8 : ప్రసిద్ధ ఆలయాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి నిధులను మంజూరు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హన్వాడలో నిర్వహించిన గ్రామదేవతల విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. హన్వాడలో నూతనంగా ప్రతిష్ఠించిన గ్రామదేవతల ఆలయాలకు ప్రహరీ, సీసీరోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మంత్రిని ఘనంగా సన్మానించారు. అలాగే తిరుమలగిరిలో నిర్వహించిన బీరప్పస్వామి ఉత్సవంలో మంత్రి పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో స ర్పంచ్ రేవతి, ఎంపీటీసీలు సత్యమ్మ, కల్పన, ఉపసర్పంచ్ గంగపూరి, సుధాకర్, వెంకటయ్య, లక్ష్మయ్య, బాలయ్య, జంబులయ్య, యాదయ్య, సత్యం, శ్రీనివాసులు, పెంట య్య, నాగన్న, ఆంజనేయులు, సాయిలు పాల్గొన్నారు.
అన్నివర్గాల సంక్షేమానికి కృషి
మహబూబ్‌నగర్‌టౌన్, మే 8 : అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు యూ బీగార్డెన్లో నిర్వహించిన ఈద్‌మిలాప్ కార్యక్రమానికి మం త్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహబూబ్‌నగర్ అంటే ప్రేమ, ఆప్యాయతకు ప్రతిరూపమని అన్నారు. దేశం లో ఎక్కడా లేనివిధంగా మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. మహబూబ్‌నగర్‌ను సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం శరవేగం గా అభివృద్ధి చెందుతున్నదన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, మతపెద్దలు అబ్దుల్ రజాక్‌షా ఖాద్రీ, మౌలానా నయీంకౌసర్, మౌలా నా సనవుల్లా, నాయకులు అబ్దుల్‌హాది, జాబేర్ బిన్ సయీద్, షఫీ, చాంద్, షబ్బీర్, జహంగీర్, ఇఫ్తేకార్అహ్మద్, జాకీర్ అడ్వకేట్, షేక్ఉమర్, ముంజిమిల్ తదితరులు పాల్గొన్నారు.