నాగర్‌కర్నూల్, మే 7 : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ని యజ్ఞంలా నిర్వహించాలని, పనుల్లో ఎక్కడా రాజీపడకుండా నాణ్యతగా చేపట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. శనివారం స్థానిక ఫంక్షన్హాల్లో మన ఊరు-మన బడిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యాశాఖాధికారు లు, ప్రజాప్రతినిధులు సమన్వయంగా ఉండి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. చిన్న చిన్న సమస్యలు వస్తే ఎ మ్మెల్యేల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు.
ఇప్పటికే పాఠశాలలను గుర్తించామని, కొన్ని ప్రాంతాల్లో జూనియర్ కళాశాలలు సైతం ఉన్నాయని, వాటిని కూడా అభివృద్ధి చేసేందుకు సీం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఎవరి విధులు వారు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రకటించిన వెంటనే హైదరాబాద్‌లో రెండు, మూడు పాఠశాలలను అభివృద్ధి చేశామ ని, అక్కడ ఎంతో మార్పు కనిపిస్తుందన్నారు. ప్రతి పాఠశాలలో నీటి ఇబ్బందు లు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, చిన్న చిన్న కారణాల తో నీటి సౌకర్యం లేక టాయిలెట్స్‌ను ఉపయోగించుకొనే వీలు లేకుండాపోతుందన్నారు. అలాంటి పరిస్థితులు రా కుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఒక పనిచేశామంటే శాశ్వతంగా సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నదే మన సీఎం కేసీఆర్ ఉద్ద్ధేశమన్నారు. అధికారులకు ఎ లాంటి సమస్యలు ఉన్నా ఎమ్మెల్యేలు లేదా కలెక్టర్‌కు తెలపాలన్నారు.
ఈ మం చి కార్యక్రమానికి అందరి సహకారం ఉంటుందని, దిగ్విజయంగా పూర్తి చేసుకుందామన్నారు. ఎమ్మెల్యేలు పనులు జరుగుతున్న పాఠశాలను సందర్శించాల్సిన అవసరం ఉంటుందన్నారు. పాఠశాలలో మరమ్మతులు జరిగిన అనంతరం ల్యాబ్స్, బోర్డ్స్, ఫర్నీచర్ నాణ్యతతో ఉన్నవాటిని సమకూర్చుకోవాలన్నారు. రైతు వేదికలు ఏ విధంగా పూర్తి చేసుకున్నామో మన పిల్లల భవిష్యత్తు కోసం పాఠశాలలను అదే మాదిరి బాగు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, డైరెక్టర్ దేవసేన, ఎంపీ రాములు, విప్ గువ్వల బాలరాజు, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్, గోరటి వెంకన్న, కలెక్టర్ ఉదయ్‌కుమార్, అదనపు కలెక్టర్ మనూచౌదరి, జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.