మహబూబ్‌నగర్.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం.. భూత్పూరు, జడ్చర్ల, పాలమూరు కలిసి ముడాగా ఏర్పడ డంతో రూపురేఖలే మారనున్నాయి. వావ్ అనిపించేలా ఊహించని రీతిలో దినదినాభివృద్ధి చెందుతున్నది. ‘రియల్’ రంగంలో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నది. సొంతింటి కలకు సరైన డెస్టినేషన్‌గా మారుతున్నది. దీంతో ప్లాట్లు, ఇండ్లు, భూముల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అంతగా విస్తరిస్తున్న పట్టణంలో ప్రాపర్టీ షో నిర్వహించేందుకు ‘నమస్తే తెలంగాణ’ సిద్ధమైంది. ఈనెల 14, 15వ తేదీల్లో నిర్వహించే షోను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించనున్నారు. ఒకే వేదికపై రియల్, బ్యాంకులు, నిర్మాణ సంస్థలు కొలువుదీరనున్నాయి.
మహబూబ్‌నగర్, మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ది. 2014 జూన్ కంటే ముందు వరకు జిల్లాలో రియల్ వ్యాపారం మందకొడిగా సాగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఊపందుకున్నది. ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం లో ఊహించని స్థాయిలో రియల్ రంగం కొత్త పుంతలు తొ క్కుతున్నది. 2014కు ముందు రూ.3వేల నుంచి రూ.5 వేల మధ్యలో ఉన్న గజం ధర.. ఇప్పుడు రూ.20 వేల నుంచి రూ. 25 వేల వరకు చేరుకున్నది. పట్టణంలోని భూత్పూరు రోడ్డు, జడ్చర్ల రోడ్డులో భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఇటీవల నిర్వహించిన వేలంలో రాజీవ్ స్వగృహ సారిక టౌన్షిప్ ఓపెన్ ప్లాట్లకు ఊహించని డిమాండ్ ఏర్పడింది. గజం కనీస ధర రూ.8 వేలుగా నిర్ణయిస్తే.. సరాసరి ధర రూ.18వేలకు పైగా పలికింది. గరిష్ఠంగా రూ.26,500 పలకడం విశేషం.
మహబూబ్‌నగర్ పట్టణంలో ఉద్యోగులు, వ్యాపారులు సొంత ఇంటి కల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు అపా ర్ట్మెంట్లలో ఫ్లాట్లు బుక్ చేసుకుంటుండగా.. మరికొందరు ఓ పెన్ ప్లాట్లు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. పట్టణంతోపాటు శివారుల్లోనూ అపార్ట్మెంట్ల సంస్కృతి పెరిగిపోతున్నది. సొంతింటి కోసం ప్రయత్నిస్తున్న వారికి వివిధ రి యల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు అందుబాటులోకి వచ్చారు. స్థా నిక కంపెనీలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా బిల్డర్లు వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు. ఫ్లాట్లు, ఇండ్లు నిర్మించుకునేవారి స్థాయిని బట్టి సులభమైన వాయిదాల్లో బ్యాంకులు రు ణాలు సైతం అందిస్తున్నాయి. వేలాది మందికి ఉపాధి లభిస్తున్నది.
నిర్మాణ రంగ సామగ్రికి సైతం డిమాండ్ ఏర్పడింది. మహబూబ్‌నగర్ పట్టణంలో రోడ్లు, మౌలిక వసతులు, విద్య, వైద్యం సహా సకల సదుపాయాలు అందుబాటులోకి రావడంతో ఇక్కడ స్థిర నివాసానికి చక్కని వేదికగా మారింది. ఈ తరుణంలో మహబూబ్‌నగర్ జిల్లాలో అన్ని అనుమతులున్న ఇంటి స్థలాలు, ఇండ్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు తీసుకునాలనే వారి కోసం ఈ నెల 14, 15 తేదీల్లో రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న సుదర్శన్ ఫంక్షన్ హాల్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు.
మహబూబ్‌నగర్ వాల్యూ పెరిగింది..
హైదరాబాద్‌తో పాటు రా ష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృ ద్ధి చెందాలనేది మా ఆకాంక్ష. దే శంలోని అన్ని రాష్ర్టాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడుతున్నారు. మెడికల్ హబ్‌గా దేశంలోనే నెంబర్‌వన్ స్థానం లో ఉన్నది. హైదరాబాద్‌కు వచ్చే వారి సంఖ్య పెరగడంతో స్థలాలు, భూములకు డిమాండ్ వచ్చింది. పట్టణం చుట్టూ 100 కి.మీ మేర అభివృద్ధి జరుగుతున్నది. గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. మహబూబ్‌నగర్, జడ్చర్ల సమీపంలో ఉన్న పోలేపల్లి సెజ్, దివిటిపల్లి ఐటీ హబ్ అద్భుతం. వీటి వల్ల మహబూబ్‌నగర్‌కు బ్రాండ్ వాల్యూ పెరిగింది. హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో గ్యాప్ లేకుండా అపార్ట్మెంట్స్, గృహనిర్మాణాలు వస్తాయని భావిస్తున్నాం.
అమిస్తాపూర్ వద్ద ఉన్న గ్రీన్ కౌంటీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లలో 30 ఫ్లాట్లు విక్రయించాం. స్విమ్మింగ్ పూల్, క్లబ్‌హౌస్, వాకింగ్ ట్రాక్ వంటి అంతర్జాతీయ సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నాం. జడ్చర్ల వద్ద గేటెడ్ కమ్యూనిటీ సీజన్టౌన్లో, అన్ని సౌకర్యాలతో ఓపెన్ ఫ్లాట్లు విక్రయిస్తున్నాం. పోలేపల్లి సెలబ్రిటీ టౌన్, రాయికల్ టోల్ ప్లాజా వద్ద వేదాంత పేరిట గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లు ఉన్నాయి. మంచి వాతావరణంతోపాటు నాలుగు వరుసల రోడ్లు, సమీపంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం మహబూబ్‌నగర్‌కు అదనపు అర్హతలు. అన్ని రకాల అనుమతులు ఉంటేనే ఫ్లాట్లు, విల్లాలు, గృహాలు, స్థలాలు కొనుగోలు చేయాలి.
– ఎస్.రఘుపతిరెడ్డి, ఎండీ, గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్
రాష్ట్రం ఏర్పాటయ్యాక దశ మారింది..
తెలంగాణ ఏర్పాటుకు ముందు మహబూబ్‌నగర్ పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు. రాష్ట్ర విభజన తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన పట్టణంగా నిలిచింది. పట్టణం నాలుగు వైపులా విస్తరించింది. ఇక్కడి రియల్ భూం విలువను మనకంటే ముందే ఇతర ప్రాంతాల వారు పసిగట్టారు. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి రియల్టర్లు, బిల్డర్లు మహబూబ్‌నగర్ వచ్చి వ్యాపారం చేస్తున్నారు. పదేండ్లలో సుమారు 75 శాతానికి పైగా భూముల విలువ పెరిగింది. ఇదంతా సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వల్లే సాధ్యమైంది. సరైన సమయంలో మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. ఇండ్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు, స్థలాలు కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం. అలాగే బిల్డర్లు, రియల్టర్లు తమ సంస్థలను ప్రమోట్ చేసుకునేందుకు కూడా మంచి వేదిక.
– చెరుకుపల్లి రాజేశ్వర్, క్రెడాయ్ వైస్ ప్రెసిడెంట్, మహబూబ్‌నగర్
తొలి అపార్ట్మెంట్ మేమే నిర్మించాం..
మహబూబ్‌నగర్ పట్టణంలో తొలి అపార్ట్‌మెంట్‌ను 2003 లో మేమే నిర్మించాం. అప్పుడు ఎస్ఎఫ్టీ రూ.600 ఉండేది. ఇ ప్పుడు అపార్ట్మెంట్లలో ఫ్లాట్ కొనాలంటే రూ.3,500 నుంచి రూ.4000 వరకు ధరలు పెరిగాయి. మహబూబ్‌నగర్ పట్టణం లో తొలిసారిగా గేటెడ్ కమ్యూనిటీ కామాక్షి స్మార్ట్ సిటీని వెంకటేశ్వర కాలనీలో మూడెకరాల్లో నిర్మిస్తున్నాం. హై క్వాలిటీ మె టీరియల్ వాడుతున్నాం. 4 టవర్లలో 5 ఫ్లోర్లతో 135 ఫ్లాట్లు ని ర్మిస్తున్నాం. ఇప్పటికే ఒక బ్లాక్‌లో 30 ఫ్లాట్లలో గృహప్రవేశాలు జరిగాయి. మా గేటెడ్ కమ్యూనిటీలో 10,500 ఎస్ఎఫ్టీలో మూడు ఫ్లోర్లలో నిర్మిస్తున్న క్లబ్ హౌస్ ఎంతో ప్రత్యేకం. సూపర్ మార్కెట్, జిమ్, ఇండోర్ గేమ్స్, బంక్వెట్ హాల్ వంటి ఆకట్టుకునే సౌకర్యాలున్నాయి. రెరా ప్రాజెక్టులో భాగంగా మా గేటెడ్ కమ్యూనిటీలో ల్యాండ్ స్కేప్స్, చిల్డ్రన్ ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ ఫూల్ వంటి సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
– యుగంధర్, ఎండీ, కామాక్షి కన్ స్ట్రక్షన్స్, మహబూబ్‌నగర్