‘పేట’లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న మంత్రి
నారాయణపేట, మే 7 : నారాయణపేట మున్సిపాలిటీలో రూ.81 కోట్ల 94 లక్షల వ్యయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు 9వ తేదీన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నారాయణపేటలోని మినీ స్టేడియంలో జరిగే ప్రజా కృతజ్ఞత సభకు హాజరై ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. ఈ సభకు నియోజకవర్గంలో అన్ని మండలాలు, మున్సిపాలిటీల పరిధి నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఎమ్మెల్యే కోరారు.