మహబూబ్నగర్, మే 7 : అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశమందిరంలో శనివారం దళితబంధు, సెంట్రింగ్ మెటీరియల్, డబుల్బెడ్రూం ఇండ్లు, మనఊరు-మనబడిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళితబంధు పథకంలో 34 యూ నిట్లు మంజూరయ్యాయని, ఇన్వాయిస్ సమర్పిస్తే నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. దళితబంధుతో సెం ట్రింగ్ మెటీరియల్ తీసుకున్న వారికి డబుల్బెడ్రూం ఇండ్లు, మనఊరు-మనబడి కా ర్యక్రమాలకు అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా 291 పాఠశాలల్లో పనులను చేపడుతున్నామని, దళితబంధు లబ్ధిదారుల సెంట్రింగ్ను వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఎస్సీ సంక్షేమ అధికారి యాదయ్యగౌడ్, పరిశ్రమల శాఖ మేనేజర్ బాబూరావు ఉన్నారు.
ఆన్లైన్లో పొందుపర్చాలి
మనఊరు-మనబడి కార్యక్రమంలో బా గంగా ఆయా పాఠశాలల్లో గుర్తించిన అంచనాలను నిర్దేశిత గడువులోగా ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ వెంకట్రావు అ న్నారు. కలెక్టరేట్లోని కంప్యూటర్ విభాగంలో మనఊరు-మనబడి నివేదికల ప్రక్రియను పరిశీలించారు. గుర్తించిన ప్రతి పని ని అప్లోడ్ చేయాలని సూచించారు.