మహబూబ్‌నగర్, మే 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స మైక్య రాష్ట్రంలో కరెంట్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వ్యవసాయానికి కేవలం ఆరు గంటల విద్యుత్ మాత్రమే వచ్చేది. అ ది కూడా పగలు 3 గంటలు.. రాత్రి 3 గంటల మేర ఉండే ది. లోడ్ ఎక్కువగా ఉండడంతో ట్రాన్స్ఫార్మర్లు తరచుగా కాలిపోయేవి. రాత్రిపూట పొలం వద్ద నీళ్లు పారించేసుకునేందుకు వెళ్లి పలువురు రైతులు మృత్యువాత పడి వారి కుటుంబాలకు కన్నీటి గోస మిగిలింది. సమైక్య రాష్ట్రం లో వెనుకబడిన పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు లేక కేవలం బోరుబావుల కింద మాత్రమే వ్యవసాయం చేసే వాళ్లు.. వేలాపాలా లేని కోతలు, లో ఓ ల్టేజీ సమస్య వల్ల బోర్లు బావులలో నీళ్లున్నప్పటికీ పొలాల్లోకి భావించుకోవాలి లేని దుస్థితి. వ్యవసా యం చేస్తే అప్పుల పాలు ఇవ్వడం తప్ప వేరే మార్గం లేక పలువురు రైతులు ఉపాధి వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు కూడా వలస వెళ్లేవారు. సమైక్య రాష్ట్రంలోనే పాలమూరు నుంచి ముంబై, పూణె తదితర ప్రాంతాలకు వలసలు ఉండేవి.
ఇక మా కష్టాలు తీరవు అని అన్నదాత నిట్టూర్పు విడిచిన వేళ… సీఎం కేసీఆర్ పోరాట ఫలితంగా తెలంగా ణ ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రథమ ప్రాధాన్యంగా విద్యుత్ సంక్షోభాన్ని అరికట్టే దిశ గా సీఎం కేసీఆర్ అడుగులు వేశారు. బాలారిష్టాలను అధిగమిస్తూ వ్యవసాయానికి పగటిపూటే మెరుగైన విద్యుత్ అందించటం ప్రారంభించారు. 2018 నుంచి వ్యవసాయానికి ఉచిత నిరంతర, నాణ్యమైన విద్యుత్ అం దించడం మొదలు పెట్టడంతో తెలంగాణ అ న్నదాతల కష్టాలన్నీ తీరిపోయాయి. ఒకప్పు డు కరెంట్ కోసం గోస పడిన రైతులు ఇప్పుడు సంతోషంగా పంటలు పండించుకుంటున్నారు. కరెంట్ అంటే రాత్రి వెళ్లి బావులు మోటర్ల వద్ద జాగారం చేయాల్సిన తిప్పలు తప్పాయి. దేశమంతా విద్యుత్ సంక్షోభంతో కరెంట్ లేక జనం అల్లాడిపోతున్నా.. తెలంగాణలో మాత్రం కోతలు లేని కరెంట్ సరఫరా అవుతున్నది. పొరుగు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రైతులు కోసం కష్టాలు పడుతుంటే తెలంగాణలో మాత్రం అన్నదాత సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నాడు.
గతంలో నష్టాలపాలయ్యాం..
గతంలో విద్యుత్ కోతలతో రైతులను తీవ్ర నష్టాల పాలుచేశారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియకపోయేది. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ రైతుల బాధలు గమనించి 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారు. దీంతో మోటార్లు కాలిపోవడం లేదు. సీఎం కేసీఆర్ మేలు మర్చిపోలేనిది.
– కడారి కృష్ణయ్య, రైతు, కొట్ర, వెల్దండ మండలం
కరెంట్ ఫికర్ లేదు..
నాకు 11 ఎకరాలు ఉన్నది. 20 ఏండ్లుగా వ్యవసాయం చేస్తున్న. ఉమ్మడి రాష్ట్రంలో రోజుకు ఆరు గంటలు కూడా కరెంట్ ఉండకుండు. తిండి గింజల కోసం బోర్ల కింద నాలుగు బంధాలు వరి పెట్టుకుంటే నీరు పారబెట్టేందుకు చాలా తిప్పలయ్యేది. రాత్రనక, పగలనక నిద్ర కాసి పంటను కాపాడుకునెటోళ్లం. ఇప్పుడు మూడెకరాల్లో వరి, ఎనిమిది ఎకరాల్లో చెరుకు వేసిన. కరెంట్ కోత, నీళ్ల ఫికర్ లేదు. ఒకవేళ కరెంట్ పోతే ఐదు నిమిషాల్లో సమస్యను పరిష్కరిస్తున్నారు.
– కడియాల చిన్న నర్సింహులు, రైతు, అమరచింత
చిన్న రిపేర్లే వస్తున్నాయి..
గతంలో నెలకు 60 నుంచి 90 కాలిపోయిన మోటార్లు దుకాణానికి వచ్చేవి. మోటార్లు బాగు చేసేలోపు పంటలు ఎండుతాయని రైతులు బాధపడెటోళ్లు. ఏడేండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన కరెంట్ ఉచితంగా అందిస్తున్నది. దీంతో మోటార్లు కాలిపోవడంలేదు. మరమ్మతులకు వచ్చినా చిన్న రిపేర్లే ఉంటున్నాయి.
– భీమిరెడ్డి, మోటార్ మెకానిక్, అయిజ
నాణ్యమైన కరెంట్ సరఫరా..
జిల్లాలో 24 గంటల నాణ్యమైన కరెంట్‌ను నిరంతరం సరఫరా చేస్తున్నాం. ఏడేండ్ల కిందట కరెంట్ కోతలుండేవి. ప్రస్తుతం విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలు పెరిగి సరఫరా సైతం మెరుగైంది. లోటుపాట్లను ఎప్పటికప్పుడు సరిచేస్తూ వ్యవసాయానికి, పరిశ్రమలు, గృహావసరాలకు 24 గంటల కరెంట్‌ను అందిస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులకు వస్తే వెంటనే మార్పులు చేసి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– మోహన్, డీఈ, గద్వాల
లో ఓల్టేజీ సమస్యల్లేవు..
గతంలో జీవితం బిజీబిజీగా గడిచేది. చాలా మోటార్లు లో, హై వోల్టేజీ సమస్యతో కాలిపోయేవి. వైండింగ్ చేయడానికి సమయం దొరికేది కాదు. రైతులు మోటార్లను తొందరగా వైండింగ్ చేయమని ప్రాధేయపడేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎప్పుడో ఒక్కటి వస్తున్నది. ఎక్కువగా గృహాలకు సంబంధించిన మోటార్లు రిపేర్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఓల్టేజీ సమస్యలు తీరిపోయాయి. సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు బిగించడంతో మోటార్లు కాలిపోయే పరిస్థితి లేదు.
– గణేశ్, మోటార్ మెకానిక్, వనపర్తి
ఏపీలో కరెంట్ కోతలే..
ఏపీలో కరెంట్ కోతలతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాకు ఐదెకరాలు ఉన్నది. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారని తెలిసింది. ఆ రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలు బాగున్నాయి. కర్నూల్, అనంతపురం జిల్లాలను కలిపి రాయలతెలంగాణ ఏర్పాటు చేస్తే బాగుండేది. ఎంతో అభివృద్ధి జరిగేది.
– తీర్థప్రసాద్, తిమ్మాపురం, కమ్మదురు మండలం, అనంతపురం జిల్లా
రైతులకు ఎంతో మేలు..
23 ఏండ్లుగా తొమ్మిదెకరాల్లో సాగుచేస్తున్న. సమైక్య పాలనలో ఏనాడూ సక్రమంగా కరెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. బోర్లలో నీళ్లు ఉన్నా.. కరెంట్ లేకపోవడంతో పంటలు చేతికందక అప్పుల పాలయ్యేవాళ్లం. కరెంట్ ఎప్పుడు వస్తదో అని కాపలా కాసెటోళ్లం. లో ఓల్టేజీ సమస్యతో మోటార్లు కాలిపోతుండె. ఇప్పుడు కరెంట్ కోతల్లేవు. ప్రస్తుతం మామిడి తోట సాగు చేస్తున్న. ఏ రోజు కూడా తోటలు ఎండలేదు. ఏడాదైనా మోటార్లు కాలిపోవడంలేదు. వేసవిలోనూ నాణ్యమైన కరెంట్ ఇస్తుండడంతో ఇబ్బందుల్లేవు. దేశంలో ఎక్కడాలేని విధంగా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం సీఎం కేసీఆర్‌కే సాధ్యం.
– రంగు వెంకటేశ్, రైతు, అయిజ
వేసవిలోనూ సమస్యలేదు..
మా టైలర్ షాపులో సుమారు 20 మంది అమ్మాయిలు టైలరింగ్ నేర్చుకుంటున్నారు. కరెంట్ మిషన్‌తో బట్టలు కుడుతున్నాం. వేసవిలోనూ 24 గంటలపాటు కరెంట్ ఉండడంతో బట్టలు కుట్టేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్యాన్లు వేసుకొని హాయిగా ఉంటున్నాం. గిరాకీ కూడా బాగానే ఉంటున్నది. నిరంతరం కరెంట్ ఉండడంతో సమయానికి బట్టలు డెలివరీ ఇవ్వగలుగుతున్నాం.
– రాజేశ్వరి, టైలర్, శాంతినగర్
విద్యుత్ బ్రహ్మాండం..
తెలంగాణ వచ్చాక విద్యుత్ సమస్య లు తీరాయి. సమైక్య పాలనలో కరెంట్ లేక పంటలు ఎండి.. అప్పుల పాలు అ య్యేవాళ్లం. రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు. ఇప్పుడు నిరంతర ఉచిత విద్యుత్‌తో బ్రహ్మాండంగా సాగు చేసుకుంటున్నాం. రాత్రి పూట నీళ్లు పట్టేందుకు పొలం కాడికి వెళ్లే బాధ తప్పింది. ఎంతో సంతోషంగా జీవిస్తున్నాం.
– వీ.కాడూరాం, రైతు, ఎంజీ కాలనీ తండా, వెల్దండ మండలం
రోజుకు ఐదు మోటార్లు వచ్చేవి..
సమైక్య రాష్ట్రంలో వ్యవసాయానికి 7 గంటలే కరెంట్ ఉండేది. విద్యుత్ సరఫరా లో హెచ్చుతగ్గులు ఉండడంతో స్టార్టర్లు, మోటార్లు వైడింగ్ కాలిపోయేది. నిత్యం 4-5 మోటార్లు రిపేర్ కోసం వచ్చేవి. స్టార్టర్లు పూర్తిగా కాలిపోవడంతో రైతులు కొత్తవి కొనుగోలు చేసేవారు. టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతున్నది. లో ఓల్టేజీ సమస్యలు లేకపోవడంతో మోటార్లు కాలిపోవడం లేదు. ఇప్పుడు రోజుకు ఒకటి, రెండు మాత్రమే రిపేరుకు వస్తున్నాయి. ఒక్కోరోజు అసలు రావడం లేదు.
– సాయిలు, బోర్ మోటారు మెకానిక్, జడ్చర్ల
అస్సలు కరెంట్ పోలేదు..
తెలంగాణలో ప్రతి పల్లెకూ 24 గంటల కరెంట్ ఇవ్వడం హర్షణీయం. ఏపీలో ఎ ప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు. రెండు రోజుల కిందట శుభకార్యం కోసం అలంపూర్ మండలం ఊట్కూర్ గ్రామానికి వ చ్చాం. రెండు రోజుగా నిమిషం కూడా క రెంట్ పోలేదు. కరెంట్ కోతలతో ఏపీలోని ప్రజలు ఎండ తీవ్రతకు ఇండ్లల్లో ఉండలేకపోతున్నారు. తాగునీటికి రాత్రి పూట జాగారం చేయాల్సిన దుస్థితి వచ్చింది. తెలంగాణలోని ప్రభుత్వ పథకాలు చాలా బాగున్నాయి.
– శ్రీనివాసులు, దామగాట్ల, నందికొట్కూర్ తాలూకా, కర్నూల్ జిల్లా
గతంలో ఇబ్బందులు పడ్డాం..
25 ఏండ్లుగా ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నా. గతంలో కరెంట్ కోసం ఎదురుచూస్తూ ఒప్పుకున్న పని పూర్తి చేయడానికి రాత్రింబవళ్లు మేల్కోవాల్సి వచ్చేది. ఆర్డర్లు ఒప్పుకోవడానికి కూడా జంకెటోళ్లం. తెలంగాణ ఏర్పాటయ్యాక కరెంట్ కోతలే లేవు. మిషన్ ఆపకుండా పనిచేస్తున్నాం. సరైన సమయానికకి పత్రికలు డెలివరీ చేస్తున్నాం. ఏపీలో కరెంట్ కోతలు ఉన్నందున తెలంగాణలో ఆర్డర్ ఇస్తున్నారు.
– సత్యం, రాఘవేంద్ర ప్రింటర్స్, శాంతినగర్
రాత్రిళ్లు పొలానికి వెళ్లే బాధ తప్పింది..
పొలంలో నారుపోయడం నుంచి పెరిగే వరకు నీళ్లు పట్టేందుకు రాత్రిపూట పొలానికి వెళ్లెటోళ్లం. చలికి పొలాల వద్ద కాపలా కాసేవాళ్లం. కరెంట్ సమస్యలతో సమైక్య రాష్ట్రంలో చాలా అవస్థలు పడ్డాం. తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ రైతు సంక్షేమంపై దృష్టి సారించారు. నిరంతర ఉచిత విద్యుత్ ఇవ్వడంతో లాభదాయకమైన పంటలు సాగు చేస్తున్నాం. అంజీర, దానిమ్మ, సీతాఫలం, మామిడి తోటలు వేసుకొని లాభాలు ఆర్జిస్తున్నాం.
– శేషిరెడ్డి, రైతు, జిల్లెడుదిన్నె