వంగూరు, మే 4 : కేంద్రం తె లంగాణపై సవతి తల్లి ప్రేమ చూ పుతున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మె ల్యే గువ్వల బాలరాజు ధ్వజమెత్తా రు. రాష్ట్రంలో పండిన ధాన్యం కొనుగోలు చేయకుండా మన రైతులపై మోదీ సర్కార్ వివక్ష చూపుతున్నదని విమర్శించారు. బుధవారం మండలంలోని రంగాపూర్ గ్రామంలో సింగిల్‌విండో ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనది రైతు సంక్షేమ ప్రభుత్వమని, అందుకే కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకు న్నా సీఎం కేసీఆర్ ప్రతిగింజనూ కొంటామని చెప్పారన్నారు. అందుకే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతుల వడ్లను కొనుగోలు చేసేందుకు ఒప్పించని జాతీయ పార్టీల నేతలు ఎందుకు పాదయాత్రలు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
వంగూరు మండలంలో 30 వేల ఎకరాలకు ఎంజీకేఎల్ఐ నుంచి సాగునీరు అందించడంతో ఈ ప్రాంతంలోని రైతులు అధికంగా లాభపడ్డారని పేర్కొన్నారు. సాగునీటికి నోచుకోని గాజర, తిప్పారెడ్డిపల్లి, తిరుమలగిరితోపాటు మరి కొన్ని గ్రామాలు త్వరలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే రైతు లు ధాన్యం విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమమ్మ లాలూయాదవ్, వైస్ ఎంపీపీ సంధ్య, సింగిల్‌విండో చైర్మన్ సురేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ బాలస్వామి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజేందర్‌రెడ్డి, కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సురేందర్, నాయకులు ఆనంద్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, నర్సింహారెడ్డి, నాగేశ్, సీఈవో విష్ణుమూర్తి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.