ఊట్కూర్, ఏప్రిల్ 12 : మండలంలోని చిన్నపొర్ల జెడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మా ర్కుల జాబితాను మంగళవారం క్లస్టర్ ప్రధానోపాధ్యాయు లు సురేశ్, వెంకట్రాములు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి తే 10 పాయింట్లు సాధించవచ్చని సూచించారు. సమయా న్ని వృథా చేయకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జగన్నాథ్‌రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మూల్యాంకన తనిఖీ
కృష్ణ, ఏప్రిల్ 12 : పదో తరగతి విద్యార్థుల అంతర్గత మార్కులకు సంబంధించిన మూల్యాంకన మార్కులను మంగళవారం మండలంలోని మేరి మెమోరియల్ ఉన్నత పాఠశాలలో క్లస్టర్ ప్రధానోపాధ్యాయుడు నిజాముద్దీన్ ఆ ధ్వర్యంలో పరిశీలన బృందం తనిఖీ చేశారు. తనిఖీలో భా గంగా విద్యార్థుల రాత, ప్రాజెక్టు పనులు, సృజనాత్మకతాంశాలు, నిర్మాణాత్మక పరీక్షలు-2, సంగ్రాహణాత్మక పరీక్ష-1లను ఉపాధ్యాయులు విద్యార్థులకు కేటాయించిన మార్కులను సవిధములు 20 మార్కులకు గానూ ఎంత కేటాయించారో అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో బృందం సభ్యులు సోమనాథ్రె డ్డి, రంగారావు, గోపాల్, పాఠశాల నిర్వాహకు డు జకిరయ్య, ప్రధానోపాధ్యాయుడు మధుసూ దన్, అకౌంటెంట్ వెంకటేశ్, ఉపాధ్యాయ బృం దం పాల్గొన్నారు.
ఘనంగా స్వయం పరిపాలన్న దినోత్సవం
మాగనుర్, ఏప్రిల్ 12 : మండలంలోని వర్కూర్ పాఠశాలలో మంగళవారం స్వయం పరిపాలన్న దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయు డు ప్రశాంత్‌కుమార్ తెలిపారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి వారికి పాఠాలు బోధించి ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.