వనపర్తి, ఏప్రిల్ 1 : ఎన్నో ఎండ్లుగా సాగునీటి కోసం తహతహలాడుతున్న గిరిజనుల గోసను తీరుస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని వశ్యాతండాలో మంత్రి పర్యటిం చి, గిరిజనుల సమస్యలను తెలుసుకున్నారు. గిరిజనులు మంత్రికి ఘనస్వాగ తం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేకంగా కాల్వలు త వ్వించి మూడు నెలల్లో తండాకు సాగునీరు అందిస్తామన్నారు. తండా నుంచి పట్టణానికి వెళ్లే రోడ్డు పనులను 45 రో జుల్లో పూర్తి చేయిస్తానన్నారు. స్థలం ఉండి ఇల్లు లేని అర్హులు ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. 57 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఆ సరా పింఛన్లు అందిస్తామన్నారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే గిరిజన నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, కౌన్సిలర్లు శాంతి, కృష్ణ, నాయకులు రమేశ్‌నాయక్, శరవంద, కృష్ణ, గులాం, టీఆర్ఎస్ పట్టణ యూత్ అధ్యక్షుడు గిరి, మండల యూత్ ప్రధాన కార్యదర్శి గణేశ్నాయుడు, నాయకులు రాము, సుభాశ్ తదితరులు పాల్గొన్నారు.